మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మీ సలహాలు ఇలా పంపండి.. ఏప్రిల్ 15 లాస్ట్ డేట్

Musi River : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై అభిప్రాయాలు స్వీకరించాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సలహాలను స్వీకరించనున్నారు.

Published on: Mar 31, 2026, 17:35:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ పనులు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా కొనసాగుతాయన్నారు.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై సమీక్ష
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై సమీక్ష

ఈ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మార్చి 31 నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా అభిప్రాయాల సేకరణ చేపడుతున్నామని భట్టి చెప్పారు. ప్రజలు తమ సూచనలను musirrdc@gmail.com మెయిల్ ఐడీకి పంపవచ్చన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి విలువైన సూచనను అధికారులు విశ్లేషిస్తారని తెలిపారు.

'అవసరమైన పక్షంలో సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ సభ్యులు నేరుగా భేటీ అవుతారు. నిర్మాణ డిజైన్లు, పునరావాసం, డిఫెన్స్ అంశాలు, బ్యాంకర్లతో చర్చల వంటి కీలక పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం, ప్రజల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా మూసీ పునరుజ్జీవ ప్రణాళికలు రూపొందించి, ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది.' అని భట్టి విక్రమార్క చెప్పారు.

ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పొన్నం

అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.. ప్రజావాణిలో ఫిర్యాదుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజావాణిలో ముఖ్యంగా ఇల్లు లేని వారు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పింఛన్లు, ధరణి ద్వారా భూరికార్డుల్లో సమస్యలు భూ భారతిలో సమస్యల పరిష్కారంపై అధికారులతో మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులపై సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

ఆర్టీసీలో వివిధ కారణాల వల్ల శాశ్వతంగా రిమూవ్ అయిన వారు తమ ఉద్యోగాలు సర్వీసులోకి తీసుకోవడంపై త్రిమెన్ కమిటీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తో మాట్లాడుతూ.. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తు లు, వాటి పరిష్కారంపై చర్చించారు. పోలీస్ కేసులకు సంబంధించిన వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More