ఎల్బీ నగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌.. కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి

ఎల్బీ నగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతేకాదు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

Published on: Oct 13, 2026, 16:20:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్‌లో రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎల్బీ నగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు, NH-167K పై కృష్ణా నది మీదుగా నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారి ప్రాజెక్టులపై చర్చించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో గడ్కరీని కలిశారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్రమంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్రమంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి

కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి అనేక కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం కొత్తగా డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. పర్వతమాల పథకం కింద తెలంగాణకు 5 రోప్‌వేలను మంజూరు చేయడంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

అలాగే సేతు బంధన్ పథకం కింద 3 కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం నుంచి ఆమోదం లభించింది. హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే విషయంలోనూ గడ్కరీ సానుకూలంగా ఉన్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో గుర్తించిన 34 పనులకు సీఆర్ఐఎఫ్ నిధుల మంజూరుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

NH-65 (హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం) విస్తరణ పనులను వేగవంతం చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. పుల్లూరు–ఆలంపూర్–కొల్లాపూర్–దేవరకొండ–నల్గొండ మార్గాన్ని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారు.

'హైదరాబాద్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. NH-65 (హైదరాబాద్ – విజయవాడ – మచిలీపట్నం) విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని నితన్ గడ్కరీ హామీ ఇచ్చారు. పర్వతమాల పథకం కింద తెలంగాణకు 5 రోప్‌వేలకు ఆమోదం తెలిపారు.' కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కోమటిరెడ్డి.. 2026 నవంబర్ 19-22 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా గడ్కరీని ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More