విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా.. జనసేన నుంచి పోటీ.. లెక్కలేసుకున్న కూటమి!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం రిజర్వేషన్ ఖరారైంది. అన్‌రిజర్వ్‌డ్ జనరల్‌గా కేటాయించారు. దీంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా దివంగత నేత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఈసారి మేయర్ రేసులో నిలుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు సభ్యుల స్థానాలతో పాటు చైర్‌పర్సన్‌లు, మేయర్ల పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి.

ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని అన్‌రిజర్వ్‌డ్ జనరల్ కేటగిరీ కింద వర్గీకరించారు. విజయవాడ నగరం అన్‌రిజర్వ్‌డ్ కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అన్ని వర్గాల కీలక నాయకులు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం.. నగరంలో మొత్తం 86 వార్డులు ఉన్నాయి.
మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ జనరల్‌గా మారడంతో విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. వంగవీటి రాధాకృష్ణ ఈసారి విజయవాడ మేయర్ బరిలో నిలుస్తారనే చర్చ నగర రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాధా జనసేన పార్టీలో చేరి మేయర్ రేసులో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
విజయవాడ సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో వంగవీటి రంగా అభిమానులు, రాధా మద్దతుదారులు భారీ సంఖ్యలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బెజవాడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రాధా లాంటి లీడర్ సరైన అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు.
మేయర్ పదవి అన్‌రిజర్వ్‌డ్ కావడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో సొంతంగా ఓటు బ్యాంకు ఉన్న రాధాను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని మద్దతుదారులు భావిస్తున్నారు.
పొత్తులో భాగంగా విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ మేయర్ స్థానాలను జనసేన కోరుతోందని ప్రచారం ఉంది. మచిలీపట్నం, కాకినాడలో జనసేన సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. విజయవాడ నుంచి గ్లాస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ పవన్ కల్యాణ్ ఈ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు నడిచే స్థానం కావడంతో అందరికీ ప్రత్యేక ఆసక్తి ఉంది.
ఇప్పటికే వంగవీటి రాధా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వేర్వేరుగా కలిశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నిర్ణయంలో భాగంగానే.. రాధా పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. కానీ టీడీపీ నుంచే పోటీ చేస్తారా.. లేదంటే జనసేన నుంచి బరిలోకి దిగుతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే.. వంగవీటి రాధా భార్య పుష్పవల్లి కూడా మేయర్ బరిలో ఉంటారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. విజయవాడలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. టీడీపీలోని ఆశావహులు ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


