ప్రయాణికులకు అలర్ట్... ఈనెల 13 నుంచి విజయవాడ - తిరుపతి మధ్య ప్రత్యేక రెళ్లు! హాల్ట్ లిస్ట్

Vijayawada Tirupati special Trains : విజయవాడ - తిరుపతి మధ్య అక్టోబర్ 13 నుంచి 16 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. రైళ్ల వేళలు, ఆగు స్టేషన్ల పూర్తి వివరాలు ఇవే…

Published on: Oct 12, 2026, 13:31:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vijayawada Tirupati special Trains : దసరా, దీపావళి పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఈ పండుగ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైలు సేవలు అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు కొనసాగుతాయి. నాలుగు రోజుల పాటు నడిచే ఈ రైళ్ల ద్వారా ఇరువైపులా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఊరట లభించనుంది.

టైమింగ్స్ వివరాలు…

  • రైలు నంబర్ 07249 (విజయవాడ - తిరుపతి) : ఈ ప్రత్యేక రైలు విజయవాడ జంక్షన్ నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికులను తీసుకెళ్తూ అదే రోజు రాత్రి 7:00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07250 (తిరుపతి - విజయవాడ ): తిరుగు ప్రయాణంలో ఈ రైలు తిరుపతి నుంచి రాత్రి 9:10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

హాల్టింగ్ లిస్ట్…..

ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ లిస్టులో పెదవడ్లపూడి, దుగ్గిరాల , తెనాలి, నిడుబ్రోలు , బాపట్ల , చీరాల , చిన్నగంజాం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ శ్రేణుల బోగీలను కేటాయించారు. మొత్తం 19 ఐసీఎఫ్ (ICF) కోచ్‌లతో నడిచే ఈ రైలులో ఒక ఏసీ సెకండ్ క్లాస్, రెండు ఏసీ థర్డ్ క్లాస్, రెండు రిజర్వ్డ్ స్లీపర్ క్లాస్ , నాలుగు అన్‌రిజర్వ్‌డ్ స్లీపర్, ఎనిమిది జనరల్ సెకండ్ క్లాస్ (8 GS), రెండు ఎస్‌ఎల్‌ఆర్ (2 SLR) బోగీలు ఉంటాయి. పండుగ వేళ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని దక్షిణ తీర రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More