హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టులో మార్పులు..: కొత్త రూట్ మ్యాప్ ఇదే.. ఇలా వెళ్తుంది!

హైదరాబాద్-చెన్నై ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా కొత్త రూట్‌పై కసరత్తు చేస్తున్నారు అధికారులు.

Published on: Jun 1, 2026, 07:08:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ (Hyderabad-Chennai High Speed Rail Corridor) అలైన్‌మెంట్‌లో నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ భారీ మార్పులు చేసింది. గతంలో హైదరాబాద్-బెంగళూరు రూట్‌ను మార్చినట్లే.. ఇప్పుడు చెన్నై రూట్‌ను కూడా రీ-డిజైన్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతలను, ముఖ్యంగా ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ', డ్రై పోర్ట్ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ఈ కొత్త రూట్‌ను ఖరారు చేశారు. ఈ మార్పుల వల్ల తెలంగాణ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణ దూరం భారీగా తగ్గడమే కాకుండా, భూసేకరణ భారం కూడా తగ్గనుంది.

తొలి ప్రతిపాదన ప్రకారం.. ఈ హైస్పీడ్ రైలు శంషాబాద్ నుంచి ప్రారంభమై బాటాసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు వెళ్లాల్సి ఉంది. అయితే తాజా సర్వే ప్రకారం ఈ రూట్‌ను పూర్తిగా మార్చేశారు.

కొత్త అలైన్‌మెంట్: శంషాబాద్ ➔ ఫ్యూచర్ సిటీ ➔ ప్రతిపాదిత డ్రై పోర్ట్ ➔ హాలియా ➔ వాడపల్లి.

పాత ప్లాన్ ప్రకారం తెలంగాణలో ఈ కారిడార్ పొడవు 236 కిలోమీటర్లు. తాజా మార్పులతో ఇది ఏకంగా 123 కిలోమీటర్లకు (దాదాపు సగానికి) తగ్గిపోయింది. గతంలో 790 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేయగా, ఇప్పుడు రూట్ మారడం వల్ల భూసేకరణ అవసరం చాలా వరకు తగ్గనుంది. కొత్త ప్రణాళిక ప్రకారం తెలంగాణ పరిధిలో మొత్తం నాలుగు బుల్లెట్ ట్రైన్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు స్టేషన్లు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే రావడం విశేషం. అవి : ఫ్యూచర్ సిటీ స్టేషన్ (రంగారెడ్డి జిల్లా), డ్రై పోర్ట్ స్టేషన్ (నల్గొండ జిల్లా), హాలియా స్టేషన్ (నల్గొండ జిల్లా)వాడపల్లి స్టేషన్(నల్గొండ జిల్లా).

డ్రై పోర్ట్ స్టేషన్ నేషనల్ హైవే-19 కి సుమారు 12 కి.మీ, నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని మాల్ గ్రామానికి 15 కి.మీ దూరంలో ఉంటుంది. తెలంగాణ సముద్ర తీరం లేని రాష్ట్రం కావడంతో ఎగుమతులు, దిగుమతుల కోసం ఇక్కడ నిర్మించే డ్రై పోర్ట్‌కు ఈ స్టేషన్ పెద్ద బూస్ట్ ఇవ్వనుంది.

హాలియా స్టేషన్ స్టేట్ హైవే-167 కి సమీపంలో, హాలియా మండలానికి 10 కి.మీ దూరంలో ఉంటుంది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌కు ఇది 35 కి.మీ, నల్గొండ టౌన్‌కు 55 కి.మీ దూరంలో పడుతుంది.

వాడపల్లి స్టేషన్ స్టేట్ హైవే-167 కి 15 కి.మీ దూరం, హాలియాకు 33 కి.మీ, మిర్యాలగూడకు 60 కి.మీ దూరంలో ప్రతిపాదించారు.

ఈ మొత్తం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంషాబాద్‌ ప్రధాన ఆపరేషనల్ హబ్‌గా మారనుంది. విమాన ప్రయాణికులకు సులువుగా ఉండేలా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనం ముందే స్టేషన్ నిర్మించాలని NHSRCL భావించింది. అయితే, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల దృష్ట్యా టెర్మినల్‌కు 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఏర్పాటు చేయాలని జీఎంఆర్ సూచించింది. దీంతో ఎయిర్‌పోర్ట్ నుంచి బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌కు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రత్యేక మోనోరైల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

శంషాబాద్‌లోనే కంట్రోల్ సెంటర్

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్‌కు శంషాబాద్ కేంద్ర బిందువు కానుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే వైపు వెళ్లే అన్ని హైస్పీడ్ రైళ్లను నియంత్రించే మెయిన్ ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్, ప్రధాన మెయింటెనెన్స్ డిపోను శంషాబాద్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు NHSRCL స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More