సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు.. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఒక ఆధునిక కోచింగ్ టెర్మినల్‌గా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సరికొత్త టెర్మినల్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం, వాహనాల రద్దీని నియంత్రించేందుకు జూన్ 15, 2026 నుండి 'యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్' విధానాన్ని అమలు చేయబోతున్నారు.

రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ కొత్త భవనం(ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు) వద్దకు వచ్చే ప్రయాణికుల పికప్, డ్రాప్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త సౌత్ టెర్మినల్ భవనం (ప్లాట్‌ఫారమ్ నం. 9 వైపు) ప్రయాణికులకు మంచి అనుభూతిని ఇచ్చేలా ఆధునికీకరించారు.
ఇక్కడ విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక ప్లాట్‌ఫారమ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మరియు ప్రీమియం మోడ్యులర్ టాయిలెట్లు, మెరుగైన సైనేజ్ (దిశానిర్దేశ సూచికలు), డిజిటల్ సమాచార కేంద్రాలు, ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం 6,622.09 చదరపు మీటర్ల భారీ పార్కింగ్ స్థలం ఉన్నది.
రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అనధికారిక పార్కింగ్‌ను అరికట్టడానికి, సులభంగా వాహనాలు వచ్చి వెళ్లడానికి ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులను దించడానికి, ఎక్కించుకోవడానికి వచ్చే వాహనాలకు మొదటి 20 నిమిషాలు ఎలాంటి ఛార్జీలు ఉండవు(ఉచితం). ఒకవేళ వాహనాలు 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం స్టేషన్ ముఖద్వారం వద్ద నిలిపి ఉంచితే భారీగా జరిమానా తరహా ఛార్జీలు పడతాయి.
నిర్దేశిత పార్కింగ్(జనరల్ పార్కింగ్) ప్రాంతంలో పార్కింగ్ టారిఫ్ మెుదటి రెండు గంటలు నాలుగు చక్రాల వాహనాలకు రూ.20, రెండు, మూడు చక్రాల వాహనాలకు రూ.15గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతీ తదుపరి గంటకు రూ.10 చొప్పున వసూలు చేస్తారు.
15.06.2026 తేదీన అర్ధరాత్రి నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది . ఈ వ్యవస్థ 2, 3, 4 చక్రాల వాహనాల కోసం ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేసి, నిరాటంకమైన పికప్, డ్రాప్-ఆఫ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించబడింది. స్టేషన్ భవనం ముందు పాదచారుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటంతో పాటు, ఈ వ్యవస్థ రద్దీని తగ్గించి, ఆటోలు, టాక్సీలు, ఇతర రవాణా సాధనాలకు సులభంగా ప్రవేశాన్ని కల్పిస్తుంది.
{{/usCountry}}15.06.2026 తేదీన అర్ధరాత్రి నుండి చర్లపల్లి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది . ఈ వ్యవస్థ 2, 3, 4 చక్రాల వాహనాల కోసం ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేసి, నిరాటంకమైన పికప్, డ్రాప్-ఆఫ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించబడింది. స్టేషన్ భవనం ముందు పాదచారుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటంతో పాటు, ఈ వ్యవస్థ రద్దీని తగ్గించి, ఆటోలు, టాక్సీలు, ఇతర రవాణా సాధనాలకు సులభంగా ప్రవేశాన్ని కల్పిస్తుంది.
{{/usCountry}}ఇక్కడ పికప్/డ్రాప్-ఆఫ్ కోసం 20 నిమిషాలలోపు ఉచిత నిష్క్రమణ ఉంటుంది. ప్రాంగణంలోకి ప్రవేశించే అన్ని వాహనాలకు డిజిటల్ టికెటింగ్ ఉంటుంది. ప్రవేశ/నిష్క్రమణ సమయాలు, రుసుములతో కూడిన డిజిటల్ రసీదులు ఇస్తారు. ఉచిత సమయ పరిమితులు దాటిన తర్వాత మాత్రమే అదనపు బస ఛార్జీలు వర్తిస్తాయి. నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఛార్జీ విధించారు.
యాక్సెస్ కంట్రోల్ ఛార్జీలు (2, 3, 4 చక్రాల వాహనాలు)కు చూసుకుంటే.. 20 నిమిషాల లోపు ఉచితంగా పికప్, డ్రాప్ ఉంటుంది. 00 - 20 నిమిషాలు ఏమీ లేదు. 20 - 30 నిమిషాలు రూ.50, 30 - 45 నిమిషాలు రూ.100, 45 - 60 నిమిషాలు రూ. 200, 60 నిమిషాలకు మించి ఉంటే రూ.500గా ఉంటుంది.
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులకు, సందర్శకులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అనధికార పార్కింగ్‌ను నివారించడం, ప్రవేశ నిష్క్రమణలను నియంత్రించడం ద్వారా ఈ వ్యవస్థ ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేసి, స్టేషన్ ముందు భాగంలో రద్దీని తగ్గిస్తుంది. ఇది పాదచారుల సురక్షితమైన, నిరాటంకమైన రాకపోకలకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఆటోలు, టాక్సీలు, బస్సులు, ఇతర రవాణా సాధనాలను ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా పొందగలుగుతారు.