చర్లపల్లి - అరుణాచలం ట్రైన్ అప్డేట్ : ఈ తేదీల్లో దారి మళ్లింపు - ఏపీలోని 3 స్టేషన్లలో ఆగదు..!
చర్లపల్లి- తిరువణ్ణామలై(అరుణాచలం) ప్రత్యేక రైలుకి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుపతి-కాట్పాడి సెక్షన్‌లో అత్యవసర మరమ్మతు పనుల (PQRS బ్లాక్స్) కారణంగా వేరే మార్గంలో మళ్లించనున్నారు. ఫలితంగా ఈ రైలు తిరుపతి సహా పలు స్టేషన్లలో ఆగదని అధికారులు ప్రకటించారు.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. తిరుపతి, కాట్పాడి సెక్షన్ల మధ్య ట్రాక్ ఆధునికీకరణ, సాంకేతిక నిర్వహణ పనుల్లో భాగంగా పీక్యూఆర్ఎస్ (PQRS) బ్లాకులను విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19, 2026 నుంచి జూలై 13, 2026 వరకు ప్రతి శుక్రవారం, సోమవారం ఈ సెక్షన్‌లో ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఇందులో భాగంగా చర్లపల్లి నుండి తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే ప్రత్యేక రైలును వేరే రూట్‌లోకి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ తేదీల్లో దారి మళ్లింపు…
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. చర్లపల్లి - తిరువణ్ణామలై(ట్రైన్ నంబర్ 07001) ప్రత్యేక రైలును దారి మళ్లిస్తారు. నిర్ణీత తేదీల్లో గతంలో నిర్ణయించిన మార్గానికి బదులుగా రేణిగుంట, మేల్పాక్కం క్యాబిన్, కాట్పాడి మీదుగా ప్రయాణిస్తుంది.జూన్ 18, జూన్ 25, జూలై 02, జూలై 09, 2026 తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
పైన పేర్కొన్న నాలుగు తేదీల్లో ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు (07001) తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఆగదు. ఈ మూడు ప్రధాన స్టేషన్లను స్కిప్ చేస్తూ రైలు నేరుగా మళ్లించిన మార్గంలో వెళుతుంది.
"సాంకేతిక పనుల దృష్ట్యా ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం" అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి అలాగే చిత్తూరు ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులు, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి…. తదనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని లేదా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

