Sign in

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. చెన్నై - తిరుపతి రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే!

అరక్కోణం యార్డ్‌ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్‌-తిరుపతి సహా 8 రైళ్లను రద్దు చేసినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు వివరాలు వెల్లడించింది.

Published on: Jun 12, 2026, 11:59:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, తిరుపతికి వచ్చే ప్యాసెంజర్లకు దక్షిణ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని అరక్కోణం రైల్వే యార్డ్‌లో మౌలిక వసతుల మెరుగుదల, విస్తరణ పనులు చేపట్టడం వల్ల ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జూన్ 26, 28 తేదీల్లో చెన్నై సెంట్రల్ - తిరుపతి మార్గంతో పాటు మొత్తం 8 రైళ్ల సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. ప్రయాణికులు గమనించాల్సిన రద్దు చేసిన ప్రధాన రైళ్ల సమయాలు, తాజా రైల్వే అప్‌డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

చెన్నై-తిరుపతి రైళ్లు రద్దు
చెన్నై-తిరుపతి రైళ్లు రద్దు

రద్దయిన రైళ్ల పూర్తి వివరాలు

చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వెళ్లే ఉదయం 6:30 గంటల సర్వీస్, అలాగే మధ్యాహ్నం 2:24 గంటల సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ నెల 26, 28 తేదీల్లో పూర్తిగా రద్దు చేశారు.

చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వైపు సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరే రైలును జూన్ 26వ తేదీన నిలిపివేశారు.

తిరుపతి నుండి చెన్నై సెంట్రల్‌కు ఉదయం 10:10 గంటలకు నడిచే రైలును ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేశారు. అలాగే, తిరుపతి నుండి సాయంత్రం 6:05 గంటలకు బయలుదేరే రైలును జూన్ 26వ తేదీన రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

యార్డు పనుల కారణంగా కేవలం తిరుపతి రైళ్లే కాకుండా, దక్షిణ భారతదేశంలోని మరికొన్ని ప్రధాన రూట్లలో కూడా రైల్వే శాఖ మార్పులు చేసింది.

అరక్కోణం, చెన్నై సెంట్రల్, తిరుత్తణి సెక్షన్లలో నడిచే దాదాపు 47 సబర్బన్ (లోకల్ ఎలక్ట్రిక్) రైళ్ల రాకపోకల్లో మార్పులు జరిగాయి. కొన్ని రైళ్లను తిరువళంగడు వద్దే షార్ట్ టెర్మినేట్ చేస్తున్నారు.

ముస్తాబాద - గన్నవరం మధ్య జరుగుతోన్న ట్రాక్ పనుల కారణంగా బెంగళూరు - గువాహటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12509) జూన్ 17, 24 తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా దారిమళ్లించి నడపనున్నారు.

దాదర్ - తిరునెల్వేలి ఎక్స్‌ప్రెస్ (11021) జూన్ 23, 24 తేదీల్లో విరుదునగర్ వరకే పరిమితం కానుంది.

ప్రయాణికులు ఈ రద్దు, రూట్ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, రైల్వే హెల్ప్‌లైన్ 139 లేదా 'National Train Enquiry System' (NTES) యాప్ ద్వారా తాజా స్టేటస్ తనిఖీ చేసుకోవాలని దక్షిణ రైల్వే కోరింది.

బిలాస్‌పూర్ - బెంగళూరు ట్రైన్

బిలాస్‌పూర్ - బెంగళూరు కంటోన్మెంట్(ట్రైన్ నంబర్ 08263) మధ్య ప్రత్యేక రైలును నడుస్తోంది. జూన్ 12వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

ఈ సమ్మర్ స్పెషల్ రైలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగాప్రయాణిస్తుండటంతో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులు, కుటుంబాలకు ఈ ప్రత్యేక రైలు సర్వీసు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

ఈ ట్రైన్ సిర్పూర్ కాజగ్ దనర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ స్టేషన్లలో ఆగుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More