రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 132 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, లిస్టులో తిరుపతి, చర్లపల్లి, కొల్లాం ట్రైన్స్..!
SCR Weekly Trains 2026 : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్ల సర్వీసులను 2026 సెప్టెంబర్ వరకు పొడిగించింది.
South Central Railway Weekly Trains 2026 : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. వేసవి కాలం ముగుస్తున్నప్పటికీ వివిధ రూట్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అదనపు రద్దీని తట్టుకునేందుకు ప్రస్తుతం నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్లను మరింత కాలం పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ పొడిగింపు ద్వారా వివిధ గమ్యస్థానాల మధ్య సెప్టెంబర్ 2026 వరకు అదనంగా మొత్తం 132 రైల్వే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్, రైళ్ల వివరాలను ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

వీక్లీ స్పెషల్ ట్రైన్స్ - వివరాలు:
- సికింద్రాబాద్ - నహర్లగూన్ (రైలు నంబర్ 07046) : ఈ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఇది 03.07.2026 నుండి 25.09.2026 వరకు మొత్తం 13 సర్వీసులు నడుస్తాయి.
- నహర్లగూన్ - సికింద్రాబాద్ (రైలు నంబర్ 07047): ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. ఇది 06.07.2026 నుండి 28.09.2026 వరకు మొత్తం 13 సర్వీసుల పాటు అందుబాటులో ఉంటాయి.
- చర్లపల్లి - సత్రాగచ్చి (రైలు నంబర్ 07221): ఈ వీక్లీ స్పెషల్ రైలు ప్రతి శనివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇది 04.07.2026 నుండి 26.09.2026 వరకు 13 సర్వీసులు నడుస్తాయి.
- సత్రాగచ్చి - చర్లపల్లి (రైలు నంబర్ 07222): ఈ రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇది 05.07.2026 నుండి 27.09.2026 వరకు మొత్తం 13 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- హైదరాబాద్ డెక్కన్ - కొల్లాం (రైలు నంబర్ 07193): కేరళ వైపు వెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం నడుస్తుంది. ఇది 04.07.2026 నుండి 26.09.2026 వరకు 13 సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
- కొల్లాం - హైదరాబాద్ డెక్కన్ (రైలు నంబర్ 07194): ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఇది 06.07.2026 నుండి 28.09.2026 వరకు మొత్తం 13 సర్వీసులుంటాయి.
- సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ (రైలు నంబర్ 07425): ఉత్తరాంధ్ర వైపు వెళ్లే ఈ వీక్లీ స్పెషల్ రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇది 05.07.2026 నుండి 27.09.2026 వరకు మొత్తం 13 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి.
- శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ (రైలు నంబర్ 07426): ఈ రైలు ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుంది. ఇది 06.07.2026 నుండి 28.09.2026 వరకు 13 సర్వీసులుంటాయి.
- జాల్నా - తిరుపతి (రైలు నంబర్ 07814): తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఈ రైలు ప్రతి గురువారం నడుస్తుంది. ఇది 02.07.2026 నుండి 24.09.2026 వరకు అత్యధికంగా 14 సర్వీసులు నడుస్తాయి.
- తిరుపతి - జాల్నా (రైలు నంబర్ 07815): ఈ తిరుగు ప్రయాణ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఇది 03.07.2026 నుండి 25.09.2026 వరకు మొత్తం 14 సర్వీసుల పాటు రాపపోకలు సాగిస్తాయి.
ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయంతో పెద్ద ఊరట లభించనుంది. తిరుపతి, శ్రీకాకుళం, కొల్లాం వంటి పుణ్యక్షేత్రాలు, ప్రధాన నగరాలకు వెళ్లే వీక్లీ స్పెషల్ రైళ్ల కాలపరిమితిని పెంచడం వల్ల సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులను గమనించి, ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ లేదా కౌంటర్ల ద్వారా ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

