SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్ ... సికింద్రాబాద్ నుంచి సమ్మర్ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ - హాల్టింగ్స్ ఇవే
SCR Summer Weekly Special Trains 2026 : వేసవి వేళ రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ - నహర్లగన్ ధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Secunderabad Naharlagun Special Trains 2026: వేసవి సెలవుల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లగన్ మధ్య ప్రత్యేక వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

మొత్తం 10 సర్వీసుల పాటు నడిచే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ఈ సమ్మర్ స్పెషల్ రైళ్లన్నీ పూర్తిగా థర్డ్ ఏసీ (3AC) కోచ్‌లతో మాత్రమే నడుస్తాయి. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేళలు, స్టాపింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
- రైలు నంబర్ 07046 (సికింద్రాబాద్ - నహర్లగన్): ఈ వీక్లీ స్పెషల్ రైలు మే 29, 2026 నుంచి జూన్ 26, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం శుక్రవారం ఉదయం 08:30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి…. ఆదివారం సాయంత్రం 16:00 (మధ్యాహ్నం 4:00) గంటలకు నహర్లగూన్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07047 (నహర్లగన్ - సికింద్రాబాద్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ 1, 2026 నుంచి జూన్ 29, 2026 వరకు నడుస్తుంది. ప్రతి వారం సోమవారం మధ్యాహ్నం 13:00 (ఒంటి గంట)కు నహర్లగన్‌లో బయలుదేరి….. బుధవారం రాత్రి 22:00 (10:00) గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
స్టాపింగ్స్ ఇవే:
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపుల ప్రయాణంలోనూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. ఈ లిస్టులో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, నరాజ్ మార్థాపూర్, జైపూర్ కె రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, ఆందుల్, దంకుని, బర్ధమాన్, బోల్పూర్ ఎస్ నికేతన్, రాంపూర్ హాట్, మాల్దా రోడ్, కిషన్‌గంజ్, బారి రోడ్, న్యూ జల్పాయిగురి, న్యూ కూచ్ బెహర్, కోక్రాఝర్, న్యూ బొంగైగావ్, బార్పేట రోడ్, రంగియా, ఉదల్గురి, రంగపరా నార్త్ హర్ముతి స్టేషన్లు ఉన్నాయి.
ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది. ముందస్తు రిజర్వేషన్ల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా అధికారిక రైల్వే కౌంటర్లను సంప్రదించవచ్చని సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

