SCR Summer Special Trains : తెలుగు ప్రయాణికులకు అప్డేట్ - చర్లపల్లి, గుంతకల్లు మీదుగా స్పెషల్ ట్రైన్..! టైమింగ్స్ ఇవే

Summer Special Trains 2026  : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. బిలాస్‌పూర్ నుండి బెంగళూరు కంటోన్మెంట్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసును నడుపుతున్నట్లు  ప్రకటించింది. ఈ ట్రైన్… ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తుంది.

Published on: Jun 9, 2026, 18:03:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Summer Special Trains 2026 : వేసవి సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించటంతో పాటు వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ నుంచి కర్ణాటకలోని బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య ఒక ప్రత్యేక సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.

బిలాస్‌పూర్ - బెంగళూరు కంటోన్మెంట్ మధ్య సమ్మర్ స్పెషల్ రైలు! (image source Pixel)
బిలాస్‌పూర్ - బెంగళూరు కంటోన్మెంట్ మధ్య సమ్మర్ స్పెషల్ రైలు! (image source Pixel)

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్ - బెంగళూరు కంటోన్మెంట్(ట్రైన్ నంబర్ 08263) మధ్య ప్రత్యేక రైలును నడపనుంది. 2026 జూన్ 12వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

ఏపీ, తెలంగాణలో ఆగే స్టేషన్లు…

ఈ సమ్మర్ స్పెషల్ రైలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగాప్రయాణిస్తుండటంతో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులు, కుటుంబాలకు ఈ ప్రత్యేక రైలు సర్వీసు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

ఈ ట్రైన్ సిర్పూర్ కాజగ్ దనర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలులో ప్రయాణించాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కానీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కానీ ముందస్తుగా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More