Sign in

IRCTC Araku Tour : ఐఆర్‌సీటీసీ అరకు టూర్ ప్యాకేజీ - ఒక్క రోజులోనే చూసి రావొచ్చు..! వివరాలు

IRCTC Araku tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం వైజాగ్ నుంచి అరకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం అదిరిపోయే రైల్ కమ్ రోడ్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రతిరోజూ అందుబాటులో ఉండే ఈ వన్ డే టూర్ వివరాలు, టికెట్ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: Jun 8, 2026, 10:41:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IRCTC Araku tour Package : అరకు ట్రిప్ ప్లాన్ ఉందా..? జలపాతాలు, కొండ కోనలు, చల్లని వాతావరణం, కాఫీ తోటలతో మురిపించే అరకు లోయ అందాలను అస్వాదించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం అద్భుతమైన వన్ డే రైల్ కమ్ రోడ్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

అరకు వ్యాలీ
అరకు వ్యాలీ

'విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' (Visakhapatnam - Araku Rail Cum Road Package) పేరుతో నడుస్తున్న ఈ టూర్ ప్యాకేజీని విశాఖ నుంచి ఆపరేట్ చేస్తారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేవలం ఒక్క రోజులోనే అరకు లోయలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూసి రావచ్చు. పర్యాటకులు తమకు నచ్చిన ఏ రోజైనా ఈ అద్భుత యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.

టూర్ షెడ్యూల్ ఇలా :

  • ఉదయం 07:00 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి (రైలు నంబర్ 58501) ద్వారా అరకు ప్రయాణం మొదలవుతుంది. మార్గమధ్యంలో దట్టమైన కొండలు, సుదీర్ఘమైన వంతెనలు, కొండలను తొలిచి నిర్మించిన గుహలు (టన్నెల్స్), అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
  • ఉదయం 11:00 గంటలకు రైలు అరకు స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పర్యాటకులను పికప్ చేసుకుంటారు. అనంతరం స్థానికంగా ఉండే గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ట్రైబల్ మ్యూజియం (Tribal Museum), అందమైన పద్మాపురం బొటానికల్ గార్డెన్‌ను సందర్శిస్తారు.
  • మధ్యాహ్నం రుచికరమైన భోజనం ముగించుకున్న తర్వాత, అరకు నుండి వైజాగ్ తిరుగు ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో సందర్శన: తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్ అందాలను చూడవచ్చు. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బొర్రా గుహలను (Borra Caves) సందర్శిస్తారు.
  • పర్యాటక ప్రాంతాల సందర్శన ముగిసిన తర్వాత రాత్రికి వైజాగ్ చేరుకుంటారు. పర్యాటకులను వారి వీలును బట్టి వైజాగ్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ వద్ద డ్రాప్ చేయడంతో ఈ యాత్ర ముగుస్తుంది.

హోటళ్లలో లగేజీ మోసే పోర్టేజ్ ఛార్జీలు, టిప్స్, మినరల్ వాటర్, లాండ్రీ, టెలిఫోన్ ఛార్జీలు వంటి వ్యక్తిగత ఖర్చులు పర్యాటకులే భరించాలి. పర్యాటక ప్రాంతాల్లో కెమెరా లేదా వీడియో కెమెరా రుసుములు, ఇటినెరరీలో పేర్కొనని ఇతర ప్రవేశ రుసుములు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణంలో పేర్కొన్నవి కాకుండా అదనపు భోజనాలు లేదా ఇతర యాక్టివిటీలకు పర్యాటకులే నేరుగా చెల్లించాలి.

ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు లేదా బుకింగ్స్ కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 1 పక్కన, ఏపీటీడీసీ కౌంటర్ వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు.

విశాఖ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్(EV) లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6545, డబుల్ అక్యుపెన్సీకి రూ.4055,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 3225గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More