...
...
Next Story

Chicken Shops Closed : తెలంగాణలో చికెన్ షాపులు బంద్

రాష్ట్రంలో చికెన్ షాపులు బంద్ అయ్యాయి. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలంటూ చికెన్ షాప్‌ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలోనే షాపులను మూసివేసి వ్యాపారులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

Published on: Apr 1, 2026, 12:23:21 IST
Advertisement

తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేస్తామంటూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చాాలా చోట్ల చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని.. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలంటూ వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు.

మార్జిన్ పెంచాలని డిమాండ్…

చికెన్ షాపులు బంద్
చికెన్ షాపులు బంద్

హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా చికెన్ షాపులు మూసివేశారు. పౌల్ట్రీ కంపెనీలు.. 26 రూపాయలు ఉన్న మార్జిన్‌ను 10 రూపాయలు తగ్గించాయని చికెన్ షాపుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు గుత్తాధిపత్యంతో ఇష్టారాజ్యంగా చికెన్ రేట్లు పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తగ్గించిన మార్జిన్‌ను పెంచే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నిరవధిక బంద్‌ చేయాలని పిలుపునిచ్చాయి. తమ బాధను అర్థం చేసుకుని.. చికెన్ ప్రియులు సహకరించాలని చికెన్ షాపుల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ మూసివేశారు.

మెజార్టీ చోట్ల షాపులు మూసివేసి ఉండగా… కొన్ని ప్రాంతాల్లో స్నేహ పౌల్ట్రీ అవుట్‌లెట్లు తెరిచి ఉంచారు. దీంతో ఇతర చికెన్ షాప్ యాజమాన్యాలు స్నేహ అవుట్‌లెట్ల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పరిధిలోని కర్మాన్ ఘాట్ లో ఓ ఔట్ లేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా…. పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఇరువర్గాలను సముదాయించి… గొడవ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

తమ సమస్యలను పరిష్కరించే వరకు దుకాణాలను తిరిగి తెరవబోమని దుకాణ యజమానులు స్పష్టం చేశారు. తమ ఆందోళనలకు ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చికెన్ షాపులు బంద్ కావటంతో…. బిర్యానీ పాయింట్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభావం పడనుంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఉండగా… చికెన్ షాపుల బంద్ తో తీవ్ర ప్రభావం పడనుంది

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks