వీడియో : మనవడి కోసం గంటె పట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. కిచెన్‌లో పూరీలు చేస్తూ సరదా ముచ్చట్లు
CM Revanth Reddy Grandson Video : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ రాజకీయాలు, సమీక్షలతో బిజీగా ఉంటారు. కానీ తాజాగా ఆయన తన మనవడు రేయాన్ష్ కోసం వంటగదిలోకి వెళ్లారు. స్వయంగా పూరీలు వండిపెట్టిన ఈ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
CM Revanth Reddy Grandson Video : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ రాజకీయాలు, ప్రత్యర్థులపై తూటాల్లాంటి విమర్శలు, సమకాలీన అంశాలపై వేసే చమత్కారాలు, ఛలోక్తులు గుర్తుకు వస్తాయి. నిత్యం అధికారులతో సమీక్షలు, పార్టీ నాయకులతో రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారాల కోసం నిరంతర అపాయింట్‌మెంట్లతో ఆయన షెడ్యూల్ ఎంతో బిజీబిజీగా సాగుతుంటుంది.

వంటగదిలో సీఎం రేవంత్…
వీలైనప్పుడు పుట్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించే సీఎం రేవంత్ రెడ్డి… ఈసారి వంటింట్లో గంటె పట్టారు. ఏకంగా వంటగదిలో ప్రత్యక్షమై వేడివేడి పూరీలు చేశారు. తన మనవడు రేయాన్ష్‌తో కలిసి సరదాగా గడిపిన కొన్ని మధుర క్షణాల వీడియోను రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్నారు.
రేయాన్ష్ కోసం ఆయనే స్వయంగా పిండి కలిపి, పూరీలు తయారు చేసి, వేడి వేడి నూనెలో వేయించి వడ్డించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మనవడి కోసం స్వయంగా వంట చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు.. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు మధుర జ్ఞాపకాలు," అని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే ఒక అగ్ర నాయకుడు, తన కుటుంబంతో ముఖ్యంగా మనవడితో ఇంత సరదాగా గడపడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో తాత, మనవళ్ల మధ్య జరిగిన ముచ్చట్లు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పూరీలు వండుతుండగా రేయాన్ష్ పక్కనే నిలబడి ఎంతో ఆసక్తిగా చూశాడు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి 'ఈ పూరీలు చాలా?' అని అడగగా, 'అమ్మమ్మకు కూడా ఒకటి వండాలి' అని మనవడు అమాయకంగా సమాధానం ఇచ్చాడు. ఈ ఫన్నీ చిట్‌చాట్ వీడియోకు మరింత అందాన్ని తెచ్చింది.
రాజకీయాల్లో ఎంతటి ఒత్తిడి ఉన్నప్పటికీ, కుటుంబంతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుందని ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా వేదికలపై ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే ముఖ్యమంత్రిలో ఒక మృదువైన, ప్రేమగల తాతయ్యను చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ గా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

