యాదగిరిగుట్టలో టీటీడీ మోడల్.. భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తిరుమలలో భూమి కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుసరించిన విధానాన్ని యాదగిరిగుట్టలో కూడా అమలు చేసేందుకు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంబంధిత అధికారులు అధ్యయనం చేయాలని ఆదేశించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అభివృద్ధి, భూ కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(MCRHRD) బోధి పవిలియన్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఆలయ అభివృద్ధి పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. యాదగిరిగుట్టలో భూముల కేటాయింపునకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, ఇక్కడ కూడా అదే తరహా పద్ధతిని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారమే భూమిని కేటాయించాలని స్పష్టం చేశారు. అలాగే ఆలయ పరిధిలో వివిధ మఠాలకు, కుల సంఘాలకు భూములు కేటాయించే విషయంలో స్పష్టమైన నిబంధనలతో కూడిన ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. అయితే ఎవరికి భూములు కేటాయించినప్పటికీ.. ఆ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం యాదగిరిగుట్ట దేవస్థానం వద్దే ఉండాలని చెప్పారు.
యాదగిరిగుట్ట కొండపై అతిథి గృహాల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలు, ప్రముఖుల జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ గెస్ట్ హౌస్‌ల నిర్మాణ అనుమతులను విడతల వారీగా మంజూరు చేయాలని, వీటి నిర్మాణ శైలిలోనూ తిరుమల మోడల్‌నే అనుసరించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా భూసేకరణ ప్రక్రియకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ భూకేటాయింపుల విధానంపై పరిశీలన చేయాలన్నారు.
యాదగిరిగుట్టపై ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గడువు విధించారు. యాదగిరిగుట్టను ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన ఒక 'టూరిజం సర్క్యూట్'ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


