...
...
Next Story

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ - కరువు సాయంతో పాటు పలు అంశాలపై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. కరవు సాయం, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఆహ్వానంపై మంత్రులతో కలిసి చర్చించారు.

Published on: Nov 15, 2026, 12:48:52 IST
Advertisement

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి…. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, అభివృద్ధి అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు, సహాయక చర్యలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ఎల్‌నినో కరవు నిధులపై వినతి

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి

ప్రధానంగా, ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలో ఏర్పడిన తీవ్ర కరవు పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. కరవు సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు అవసరమైన ప్రత్యేక ప్యాకేజీ నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు' ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. దీనితో పాటు, దేశీయ క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ వేదికగా జరగనున్న 'ఖేలో ఇండియా' పోటీలను ప్రారంభించాల్సిందిగా ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks