ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాల ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
పలువురు ప్రముఖులకు ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో వ్యవసాయాభివృద్ధిపై పుస్తకావిష్కరణ చేశారు.
సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలనేదే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ రంగంలో బహుముఖ సేవలు అందించిన ప్రముఖులకు ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో అందజేశారు.

వ్యవసాయ రంగానికి సేవలు అందించిన శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రైతులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ ఎం.సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్.డి.శిఖామణి (వ్యవసాయ శాస్త్రవేత్తలు), దిలీప్ రెడ్డి (పాత్రికేయుడు), లోనావత్ శాంతా బాయి(గిరిజన రైతు), కె.లావణ్య (సేంద్రియ రైతు) ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలు అందుకున్నారు.
ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ వ్యవసాయభివృద్ధికి అందించిన చేయూత, ఆ కాలంలో సాగు రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కె.వి.ఎన్.రెడ్డి, ఎం.భవాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


