TG Inter Exams Time Table 2027 : తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ 2027 టైమ్ టేబుల్ విడుదల
TG Inter Exams Time Table 2027 : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఫిబ్రవరి/మార్చి 2027 పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది. పూర్తి టైమ్ టేబుల్ ఇక్కడ చూడండి.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి(TGBIE) 2027 వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థుల కోసం ఫిబ్రవరి/మార్చి 2027లో నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్ టేబుల్‌ను విడుదల చేసిసంది.

ఈ షెడ్యూల్ ప్రకారం 2027 ఫిబ్రవరి 24 నుండి మార్చి 20 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. అన్ని థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులకు కూడా ఇవే తేదీలు వర్తిస్తాయని, అయితే వాటి సబ్జెక్టుల వారీ టైమ్ టేబుల్‌ను త్వరలోనే విడిగా విడుదల చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. థియరీ పరీక్షల కంటే ముందుగానే ఇంటర్నల్ అసెస్‌మెంట్, ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేస్తారు.
ఫస్టియర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్
2027 జనవరి 20 నుండి జనవరి 25 వరకు ఇంటర్నల్ నిర్వహిస్తారు. పర్యావరణ విద్య 2027 జనవరి 27న (బుధవారం) ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ 2027 జనవరి 29న (శుక్రవారం) ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది.
ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జనవరి 30న నిర్వహిస్తారు. సెకండియర్ సైన్స్ ప్రాక్టికల్స్ 2027 ఫిబ్రవరి 1 (సోమవారం) నుండి ఫిబ్రవరి 10 (బుధవారం) వరకు (ఆదివారాలతో సహా) రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ ఉంటుంది.
ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్ 2027 ఫిబ్రవరి 11 (గురువారం) నుండి ఫిబ్రవరి 18 (గురువారం) వరకు (ఆదివారంతో సహా) మూడు సెషన్లలో (ప్రతి సెషన్ 2 గంటలు) జరుగుతాయి. సెషన్-1 ఉదయం 9 నుండి 11 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 12 నుండి 2 వరకు, సెషన్-3 మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైమ్ టేబుల్
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
24-02-2027 (బుధవారం) - పార్ట్-II: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
I26-02-2027 (శుక్రవారం)- పార్ట్-I: ఇంగ్లీష్ పేపర్-I
02-03-2027 (మంగళవారం)-పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I, అకౌంటెన్సీ పేపర్-I (ACE గ్రూప్ వారికి)
05-03-2027 (శుక్రవారం)-పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I, కామర్స్ పేపర్-I (ACE గ్రూప్ వారికి)
09-03-2027 (మంగళవారం)-ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
15-03-2027 (సోమవారం)-కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-I
17-03-2027 (బుధవారం) - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, మ్యాథమెటిక్స్ పేపర్-I (MEC గ్రూప్ సింగిల్ పేపర్)
19-03-2027 (శుక్రవారం) - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I, జాగ్రఫీ పేపర్-I, బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ పేపర్-I (న్యూ అండ్ ఓల్డ్ పేపర్ - BiPC విద్యార్థుల కోసం)
ఇంటర్ సెకండ్ ఇయర్ టైమ్ టేబుల్
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
25-02-2027 (గురువారం)-పార్ట్-II: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
27-02-2027 (శనివారం)-పార్ట్-I: ఇంగ్లీష్ పేపర్-II
03-03-2027 (బుధవారం)-పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
08-03-2027 (సోమవారం)-పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
12-03-2027 (శుక్రవారం)-ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
16-03-2027 (మంగళవారం) - కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-II
18-03-2027 (గురువారం) - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II
20-03-2027 (శనివారం) - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ పేపర్-II (BiPC విద్యార్థుల కోసం)
ప్రస్తుతం విడుదలైనది తాత్కాలిక షెడ్యూల్ (TGBIE Tentative Time table) మాత్రమేనని బోర్డు పేర్కొంది. పరీక్షలకు ఇంకా సుమారు మూడు నెలల సమయం ఉన్నందున, విద్యార్థులు ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


