TG TET January 2027 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
TG TET January 2027 Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ చూడండి.
ఉపాధ్యాయ కొలువుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET - January 2027) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.

టెట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలోనే నిర్వహించనున్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 2027 జనవరి 3 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
TG TET 2027 ముఖ్యమైన తేదీలు
ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ దరఖాస్తుల ప్రారంభం-నవంబర్ 16
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - డిసెంబర్ 10
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ - డిసెంబర్ 28 నుంచి
TG TET పరీక్షల తేదీలు - జనవరి 3 నుండి జనవరి 15, 2027 వరకు
ఫలితాల విడుదల - ఫిబ్రవరి రెండో వారం
రెండు పేపర్లు
తెలంగాణ టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ప్రతి పేపర్ పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. రోజుకు రెండు సెషన్లలో (ఉదయం 9:00 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 నుండి 4:30 వరకు) పరీక్షలు జరుగుతాయి.
పేపర్-1 (Paper-I): 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు (ప్రైమరీ స్కూల్) బోధించాలనుకునే అభ్యర్థుల కోసం.
పేపర్-2 (Paper-II): 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు (అప్పర్ ప్రైమరీ) బోధించాలనుకునే అభ్యర్థుల కోసం.
రెండు పేపర్లు: అర్హత కలిగిన అభ్యర్థులు 1 నుండి 8వ తరగతి వరకు బోధించేందుకు వీలుగా రెండు పేపర్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు
కేటగిరీల వారీగా పరీక్ష ఫీజు వివరాలను విద్యాశాఖ వెల్లడించింది: జనరల్, బీసీ అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950 ఫీజుగా నిర్ణయించారు.
నవంబర్ 16వ తేదీ నుంచి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అందుబాటులోకి వస్తుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


