సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా.. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించడానికి రూ.9వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇందులో భగంగా నర్మెట సభలో తొలి విడతగా రూ.3590 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల అయ్యాయి.

తెలంగాణలో మెుత్తం 73 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ఒక ఎకరం వరకు సాయం అందించేలా రూ.3590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు వెళ్తాయి. ఆదివారం సెలవు కారణంగా సోమవారం రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2650 కోట్లు, మూడో విడుతలో రూ.2760 కోట్లను విడుదల చేయనుంది ప్రభుత్వం.
ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
అంతకుముందు నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో రూ.775 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో అత్యుత్తమ శిక్షణ పొందిన టీచర్లు లక్షకు పైగా పనిచేస్తున్నారు. 18 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నాం. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రారంభించడమే కాకుండా విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రైవేటుకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు ఉన్నారు. ప్రైవేటు మోజులో పడొద్దు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని, కానీ ఏటీసీల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత తనది అని సాంకేతిక నైపుణ్యం ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల రూ. 2 వేల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వబోతున్నామన్నారు. విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడాలని, ట్యాలెంట్ ఉంటే ప్రపంచం మనముందు తలవంచుకుని నిలబడుతుందన్నారు.
{{/usCountry}}ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని, కానీ ఏటీసీల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత తనది అని సాంకేతిక నైపుణ్యం ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల రూ. 2 వేల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వబోతున్నామన్నారు. విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడాలని, ట్యాలెంట్ ఉంటే ప్రపంచం మనముందు తలవంచుకుని నిలబడుతుందన్నారు.
{{/usCountry}}