నిజామాబాద్ లో దారుణం - కానిస్టేబుల్‌ను హత్య చేసిన క్రిమినల్..! బైక్‌పై స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఘటన
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ పై నిందితుడు కత్తితో దాడికి దిగాడు. కత్తిపోటుకు గురైన కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై డీజీపీ సీరియస్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ కేసు కేసులో పట్టుబడిన నిందితుడు… 42 ఏళ్ల కానిస్టేబుల్ పై కత్తితో దాడికి దిగాడు. బైక్ పై పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కత్తి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా పరిగణించింది.

బైక్ పై తీసుకెళ్తుండగా కత్తితో దాడి…
పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ సంఘటన అక్టోబర్ 17వ తేదీన రాత్రి 08.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాల కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాద్ అనే క్రిమినల్ ను అరెస్ట్ చేసి బైక్ పై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి… కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు రియాద్ పారిపోయాడు.అప్రమత్తమైన పోలీసులు నిందితుడు షేక్ రియాద్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. రియాద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి సూచించారు.
కానిస్టేబుల్ మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను ఓదార్చాలని ఐజీకి సూచించారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేయాలన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిసున్నారు. ఈ పరిణామం పోలీస్ శాఖలో సంచలనంగా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

