...
...
Next Story

గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్.. ఈ పత్రాలు ఉండాలి!

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నవంబర్ 14న కౌన్సెలింగ్‌ జరగనుంది. అభ్యర్థులు సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

Updated on: Nov 12, 2025, 15:45:46 IST
Advertisement

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నవంబర్ 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టుగా ప్రకటన విడుదలైంది. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14 కౌన్సెలింగ్
గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14 కౌన్సెలింగ్

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి B.Sc (ఆనర్స్) వ్యవసాయ కోర్సులో ప్రవేశలకు కౌన్సెలింగ్ జరగనుంది. అభ్యర్థులకు వారి TG EAPCET-2025 ర్యాంకుల ఆధారంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(PJTAU) క్యాంపస్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ జరుగుతుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు పుట్టిన తేదీకి సంబంధించిన రుజువును చూపించే ఎస్ఎస్‌సీ మార్కుల మెమో లేదా తత్సమాన సర్టిఫికేట్ చూపించాలి. అర్హత పరీక్షలో (ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష) దరఖాస్తుదారు పొందిన మార్కుల మెమో, ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఉండాలి.

2025-26 సంవత్సరానికి ఆదాయ సర్టిఫికేట్: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,50,000/- (రూపాయలు ఒక లక్ష యాభై వేలు మాత్రమే), పట్టణ ప్రాంతంలో నివసించే అభ్యర్థులకు రూ.2,00,000/- (రూపాయలు రెండు లక్షలు మాత్రమే) మించకూడదు.

TG EAPCET- 2025 ర్యాంక్ కార్డ్ ఉండాలి. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు/6వ తరగతి నుండి డిప్లొమా వరకు బోనాఫైడ్/స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. చివరిగా చదివిన సంస్థ నుంచి టీసీ, ప్రభుత్వం నుంచి సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థులు పైన పేర్కొన్న అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.

తల్లిదండ్రులు, అభ్యర్థులు MJPTBCWREI సొసైటీ వెబ్‌సైట్ https://mjptbcwreis.telangana.gov.in/ & PJTAU వెబ్‌సైట్ https://www.pjtau.edu.in ని అప్డేట్స్ కోసం క్రమం తప్పకుండా ఫాలో కావాలి. ఈ నోటిఫికేషన్ వ్యక్తిగత సమాచారంగా పరిగణించాలని, ప్రత్యేక సమాచారం జారీ చేయరు. అభ్యర్థులు పైన సూచించిన ర్యాంకుల ప్రకారం షెడ్యూల్ చేసిన తేదీ, సమయంలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో సంబంధిత అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్‌లను సమర్పించాలి. లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks