పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హల్ లో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో సిపీఎస్ సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ… సీపీఎస్ (CPS) విధానంలో రిటైర్మెంట్ ల సంఖ్య రోజు రోజు కు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,316 రిటైర్ అయ్యారని…. వారికి ప్రస్తుత కంట్రిబ్యూటరీ పెన్షన్ కేవలం 3000 లోపు మాత్రమే అని వాపోయారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ జీవితం అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐక్య పోరాటాల ద్వారానే ఉద్యోగులు కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకోగలమని వారు స్పష్టం చేశారు.
టి.ఎన్. జి.ఓ అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ… ఉద్యోగులు విభేదాలను పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావాలన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ “పాత పెన్షన్ (OPS) మన హక్కు-అది భిక్ష కాదు” అని స్పష్టం చేశారు. దీనిని సాధించుకునే వరకు విశ్రమించే ప్రసక్తి లేదన్నారు.
ఈ సమావేశం సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. వారి వివరాలు చూస్తే….
- జిల్లా అధ్యక్షులు - శ్రీనివాస్ యాదవ్.
- జిల్లా ప్రధాన కార్యదర్శి - సంపత్.
- జిల్లా కోశాధికారి - ప్రేమ్
- జిల్లా ఉపాధ్యక్షుడు - శ్రీనివాస్ -
- జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు - టి.శ్రీధర్
- జాయింట్ సెక్రటరీ - సాయి చరణ్ ల్యాండ్స్ & సర్వే
- ఆర్గనైసింగ్ సెక్రెటరీ - రఘుపతి
- మహిళ ఉపాధ్యక్షురాలు - కె.వనజ