తెలంగాణ : తుఫాన్ దాటికి రైతన్న ఆగమాగం - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుఫాన్ దాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
మొంథా తీవ్ర తుఫాన్ దాటికి తెలంగాణలో భారీగా పంట నష్టం వాటిల్లింది. చేతికివచ్చే దశలో రైతులకు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

12 జిల్లాల్లోని 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక తెలిపింది. పూర్తిస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత పంట నష్టం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారిక ప్రకటనలో తెలిపారు.
ప్రాథమిక నివేదిక ప్రకారం 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,30,200 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అధిక స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ బుధ, గురువారాల్లో ప్రాథమిక సర్వే నిర్వహించింది. 4,963 ఎకరాల్లో మొక్కజొన్న, 3,613 ఎకరాల్లో మిర్చి, 1,228 ఎకరాల్లో పప్పు ధాన్యాలు, 2,674 ఎకరాల్లో వేరుశనగ, 1,300 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది.
ఈ తుఫాన్ ప్రభావంతో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా 80,500 మంది రైతులు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, సూర్యాపేటలో 56,330, నల్లగొండలో 52,071 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. తీవ్రస్థాయిలో పంట నష్టం వాటిల్లడటంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవాళ సీఎం ఏరియల్ సర్వే:
ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. పంట నష్టంపై అధికారులతో చర్చించనున్నారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత సాయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

