...
...
Next Story

Daily Special Trains : సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య డైలీ స్పెషల్ ట్రైన్స్

Daily Special Trains : పండుగల రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు స్పెషల్ సర్వీసులను ప్రకటించింది. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ నడుమ ఈ రైళ్లు నడవనున్నాయి.

Published on: Oct 26, 2026, 20:00:54 IST
Advertisement

దీపావళి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ మార్గంలో 22 ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 26, 2026 నుండి నవంబర్ 05, 2026 వరకు ప్రతిరోజూ ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

రైలు నంబర్ 07711 (సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్)

సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్స్
సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్స్

అక్టోబర్ 26, 2026 నుండి నవంబర్ 05, 2026 వరకు మొత్తం 11 సర్వీసులు నడుస్తాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.

రైలు నంబర్ 07712 (సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్):

అక్టోబర్ 26, 2026 నుండి నవంబర్ 05, 2026 వరకు 11 సర్వీసులు నడుస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 11:15 గంటలకు నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఆగే ముఖ్యమైన స్టేషన్లు

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, యాదాద్రి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్‌లలో ఆగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో ఏసీ చైర్ కార్, రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

ఆక్యుపెన్సీ లేక నాందేడ్ – ఉద్నా రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే సేకరించిన ప్రయాణికుల వివరాల ప్రకారం, గతంలో ప్రకటించిన నాందేడ్ – ఉద్నా స్పెషల్ రైళ్లకు ఆశించిన స్పందన రాకపోవడంతో (తక్కువ ఆక్యుపెన్సీ) కింద పేర్కొన్న సర్వీసులను రద్దు చేశారు.

రైలు నంబర్ 07606 (ఉద్నా – హెచ్.ఎస్. నాందేడ్) మంగళవారాలు (నవంబర్ 03, 2026 నుండి నవంబర్ 24, 2026 వరకు) - మొత్తం 04 సర్వీసులు రద్దు అయ్యాయి.

పండుగ సీజన్‌లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైలు వేళలు, సీట్ల లభ్యత వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks