Telangana Weather Updates : తెలంగాణలోని భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం రాబోయే నాలుగు రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని…. మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
ఓవైపు ఎండలు… మరోవైపు వర్ష సూచన:

మే 14. 15 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రేపు (మే15) రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
మే 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితులు ఉండనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. రాబోయే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2°C నుండి 3°C మేర పెరిగే అవకాశం ఉంది. మే 16 నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత మొదలుకానుంది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఎండలు పెరగడం, వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు వస్తే…. ఎండలు క్రమంగా తగ్గి… వర్షాలు పడే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}ఎండలు పెరగడం, వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు వస్తే…. ఎండలు క్రమంగా తగ్గి… వర్షాలు పడే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}