ఏపీపై ద్రోణి, అల్పపీడనం ఎఫెక్ట్ - 4 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు - వాతావరణశాఖ
AP weather updates : బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం…. కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తా తీరం వరకు ద్రోణి
ప్రస్తుతం బీహార్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు… శ్రీలంక పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుంది. ఈ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో…… వాతావరణంలో మార్పులు ఉండనున్నాయి.
- కోస్తాంధ్ర : ఈ ప్రాంతంలో గురువారం వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత జిల్లాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉంటుంది.
- రాయలసీమ : రాయలసీమ జిల్లాల్లో మంగళవారం వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
- ఈదురుగాలులు : వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 40-50కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ముఖ్యంగా ఉరుములు, మెరుపులు మొదలైనప్పుడు చెట్ల కింద ఉండటం ప్రాణాంతకమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడటం ఏమాత్రం క్షేమం కాదని స్పష్టం చేసింది.
“వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, పొలాల్లో ఉన్న పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

