తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ : ఓవైపు వర్షాలు... మరోవైపు వడగాల్పులు హెచ్చరికలు!

Telangana Weather Updates : తెలంగాణలో ఈ నాలుగు రోజులు భిన్న వాతావరణం ఉండనుంది.  కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా… మరికొన్ని జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపనున్నాడు. 

Published on: May 14, 2026, 10:05:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Weather Updates : తెలంగాణలోని భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం రాబోయే నాలుగు రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని…. మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది.

ఓవైపుఎండలు...! మరోవైపు వర్షసూచన (image istock)
ఓవైపుఎండలు...! మరోవైపు వర్షసూచన (image istock)

ఓవైపు ఎండలు… మరోవైపు వర్ష సూచన:

మే 14. 15 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రేపు (మే15) రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.

మే 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితులు ఉండనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. రాబోయే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2°C నుండి 3°C మేర పెరిగే అవకాశం ఉంది. మే 16 నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత మొదలుకానుంది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఎండలు పెరగడం, వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు వస్తే…. ఎండలు క్రమంగా తగ్గి… వర్షాలు పడే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More