Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా? ఆగస్టు 20న లాటరీ

Indiramma Houses : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆగస్టు 20న లాటరీ తీయనున్నారు.

Published on: Aug 9, 2026, 06:29:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్ల కోసం ఇప్పటివరకు ఏకంగా 35,125 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్లు

నగరంలోని వేర్వేరు నియోజకవర్గాల నుంచి అందిన దరఖాస్తుల గణాంకాలు చూస్తే.. ఖైరతాబాద్: 4,394, కుత్బుల్లాపూర్: 4,121, నాంపల్లి: 3,613, మలక్‌పేట్: 2,846, శేరిలింగంపల్లి: 2,530, అంబర్‌పేట్: 2,357, కార్వాన్: 1,574, రాజేంద్రనగర్: 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్: 1,374, మేడ్చల్: 1,153, బహదూర్‌పురా: 1,135, సనత్‌నగర్: 1,046, మల్కాజిగిరి: 1,033, ఇబ్రహీంపట్నం: 749 దరఖాస్తులు వచ్చాయి. కుకట్‌పల్లి నుంచి 5,233 దరఖాస్తులు రాగా, మహేశ్వరం నుంచి 471 దరఖాస్తులు అందాయి.

పేద వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 30 లక్షల నుంచి రూ. 58 లక్షల వరకు విలువ చేసే ఈ ఫ్లాట్లను ప్రభుత్వం కేవలం రూ. 6 లక్షలకే లబ్ధిదారులకు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు తాము ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా, ఉంటున్న నియోజకవర్గంలోనే సొంతింటి కల నెరవేర్చుకునే గొప్ప అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందన్నారు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాటరీ ద్వారా ఇల్లు కేటాయించబడకపోతే, అభ్యర్థులు చెల్లించిన దరఖాస్తు రుసుము రూ. 10,000 లను తిరిగి రీఫండ్ చేస్తామని అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని, అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ విజ్ఞప్తి చేశారు.

ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఆగస్టు 20న లాటరీ తీసేందుకు హౌసింగ్ బోర్డు తాత్కాలికంగా తేదీని నిర్ణయించింది. ఇప్పటికే ఇందిరమ్మ హౌస్ టవర్స్ నిర్మాణ పనుల కోసం టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏడాది వ్యవధిలోనే వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా పూర్తి వివరాల కోసం పౌరులు 040-24603572 కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More