మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు - ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల, ఫైనల్ లిస్ట్ ఎప్పుడంటే..?
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను సంబంధిత మున్సిపల్ కమిషనర్లు విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత… తుది జాబితాలను ప్రకటిస్తారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా… త్వరలో ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది.

రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి పరిధిలోని మున్సిపల్, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్లోనూ ఈ వివరాలను ఉంచారు.
జనవరి 10న ఫైనల్ లిస్ట్…
117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కలిపి 45 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్జెండర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాపై జనవరి 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
పాలకవర్గం గడువు పూర్తి అయిన మున్సిపాలిటీల్లో 2,690, కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 వార్డులు ఉండగా, మిగతా 5 కార్పొరేషన్లలో 60 చొప్పున వార్డులు ఉన్నాయి. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 50 వార్డులు.. ఆదిలాబాద్, కామారెడ్డిలో 49 చొప్పున వార్డులున్నాయి.
మున్సిపాలిటీల పరిధిలోని ఓటర్లు… ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారి పరిధిలోని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెెళ్లొచ్చు. ఈనెల 4వ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు సమావేశమవుతారు. జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
ఇప్పటికే గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత…. మరింత వేగం పెరిగే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

