టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల గడువు దగ్గరపడింది. కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవావాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 1743 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటిల్లో డ్రైవర్ కొలువులు 1,000, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. ఈ పోస్టుల నియామకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు అప్పగించారు. ఆన్ లైన్ దరఖాస్తుల నుంచి అభ్యర్థులకు సంబంధిత పరీక్షలతో పాటు తుది ఫలితాల విడుదల ప్రక్రియ అంతా కూడా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డే పర్యవేక్షిస్తోంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం ఇలా….
- అభ్యర్థులు ముందుగా https://www.tgprb.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.
- హోం పేజీలో డ్రైవర్, శ్రామిక్ నోటిఫికేషన్ 2025 అని ఉంటుంది. దీని కిందనే అప్లయ్ ఆన్ లైన్ అనే లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- ముందుగా మీ ప్రాథమిక వివరాలతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శ్రామిక్ పోస్టులకు రూ.200, ఇతరులు అయితే రూ.400 దరఖాస్తు ఫీజు ఉంటుంది.
- అప్లికేషన్ ప్రక్రియ కోసం డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా టెన్త్ మెమో, ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణపత్రంతో పాటు మరికొన్ని వివరాలకు సంబంధించిన పత్రాలు ఉండాలి.
- చివరగా సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం డ్రైవర్ పోస్టులకు నెలకు రూ. 20,960 నుంచి రూ.60,080 వరకు ఉంటుంది. శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 జీతం చెల్లిస్తారు.
{{/usCountry}}ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం డ్రైవర్ పోస్టులకు నెలకు రూ. 20,960 నుంచి రూ.60,080 వరకు ఉంటుంది. శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 జీతం చెల్లిస్తారు.
{{/usCountry}}ఇక ఎస్సీ అభ్యర్థులు వర్గీకరణ (గ్రేడ్ 1,2,3) ప్రకారం కొత్త ఫార్మాట్‌లో కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ వివరాలను https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్ లో చూడొచ్చు.