ECIL Recruitment : ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూనే, ఇలా దరఖాస్తు చేసుకోండి
ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 18 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 20వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 18 ఖాళీలున్నాయి. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను రిక్రూట్ చేయనున్నట్ల నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కేటగిరి - 1 కింద ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెటీరియల్ మేనేజ్ మెంట్ విభాగంలో డిగ్రీ ఉండాలి. ఇక కేటగిరి - 2 కింద రిక్రూట్ చేసే పోస్టులకు బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం తప్పకుండా ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్లుగా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులకు 2026 ఫిబ్రవరి 20వ తేదీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కార్పొరెట్ లెర్నింగ్, డెవలప్ మెంట్ సెంటర్, నలంద కాంప్లెస్, ఈసీఐఎల్, హైదరాబాద్ - 500062 చిరునామా నందు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి.
అప్లికేెషన్ ప్రాసెస్ - ఇతర వివరాలు
- అభ్యర్థులు https://www.ecil.co.in/jobopenings వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ ను చూడాలి. దీని పక్కనే అప్లికేషన్ ఫారమ్ ఆప్షన్ ఉంటుంది.
- అప్లికేషన్ ఫారమ్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఈ అప్లికేషన్ ఫారమ్ లో అభ్యర్థి పూర్తి వివరాలను నమోదు చేయాలి. దీనికి అభ్యర్థి బయోడేటాను జత చేయాలి.
- విద్యా అర్హత పత్రాలను అటెస్ట్ చేయించిన జిరాక్స్ కాపీలను కూడా జత పర్చాలి. ఇందులో టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ఇతర ధ్రువపత్రాలను ఉంచాలి.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ తో ఫిబ్రవరి 20వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
- దరఖాస్తులను పరిశీలించిన షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
- అభ్యర్థి క్వాలిఫికేషన్, పనిచేసిన అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తారు.
- ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 మధ్య జీతం చెల్లిస్తారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోండి
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

