తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక కార్పొరేషన్ (TSCMFC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 'ఆర్థిక సహాయ పథకం' కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు.

ఈ పథకం కింద విభిన్న ఉపాధి రంగాలకు సంబంధించిన యూనిట్లను ప్రభుత్వం కేటాయించనుంది. కుట్టు మిషన్లు , చిన్న తరహా వ్యాపారాల నిర్వహణకు ఒక విభాగంగా….. అలాగే ఈ-బైక్ (E-Bike), ఈ-స్కూటీ , మోటార్ బైక్ యూనిట్లను మరొక విభాగంగా నిర్ధారించారు. దరఖాస్తుదారుల వయస్సు, విద్యార్హతలను బట్టి ఈ యూనిట్లను మంజూరు చేస్తారు.
- కుట్టు మిషన్లు, చిన్న వ్యాపారాల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఈ-బైక్, ఈ-స్కూటీ, మరియు మోటార్ బైక్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి.
- ఆదాయ పరిమితి విషయానికి వస్తే….. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికైతే రూ. 2,00,000 లోపు, అదే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికైతే రూ. 1,50,000 లోపు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
దరఖాస్తు ప్రక్రియ…. జూలై 31 చివరి తేదీ
అర్హత కలిగిన క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జూలై 31, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు గడువు విధించారు.
{{/usCountry}}అర్హత కలిగిన క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జూలై 31, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు గడువు విధించారు.
{{/usCountry}}అభ్యర్థులు పూర్తి వివరాల కోసం tsobmms.cgg.gov.inవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ tscmfc.in ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే 040-233391067 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కార్పొరేషన్ ఎండీ పి.సబిత పేర్కొన్నారు.