స్వయం ఉపాధి పథకం : ఉచిత కుట్టు మిషన్లు, బైక్‌లు – జులై 31 వరకు గడువు పొడిగింపు

రాష్ట్రంలోని అర్హులైన క్రైస్తవ మైనారిటీల కోసం ఆర్థిక సహాయ పథకం కింద ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువును జులై 31వ తేదీ వరకు పొడిగించారు.

Published on: Jul 18, 2026, 14:12:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక కార్పొరేషన్ (TSCMFC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 'ఆర్థిక సహాయ పథకం' కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు.

స్వయం ఉపాధి పథకం : ఉచిత కుట్టు మిషన్లు, బైక్‌లు – జులై 31 వరకు గడువు పొడిగింపు
స్వయం ఉపాధి పథకం : ఉచిత కుట్టు మిషన్లు, బైక్‌లు – జులై 31 వరకు గడువు పొడిగింపు

ఈ పథకం కింద విభిన్న ఉపాధి రంగాలకు సంబంధించిన యూనిట్లను ప్రభుత్వం కేటాయించనుంది. కుట్టు మిషన్లు , చిన్న తరహా వ్యాపారాల నిర్వహణకు ఒక విభాగంగా….. అలాగే ఈ-బైక్ (E-Bike), ఈ-స్కూటీ , మోటార్ బైక్ యూనిట్లను మరొక విభాగంగా నిర్ధారించారు. దరఖాస్తుదారుల వయస్సు, విద్యార్హతలను బట్టి ఈ యూనిట్లను మంజూరు చేస్తారు.

  • కుట్టు మిషన్లు, చిన్న వ్యాపారాల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఈ-బైక్, ఈ-స్కూటీ, మరియు మోటార్ బైక్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఆదాయ పరిమితి విషయానికి వస్తే….. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికైతే రూ. 2,00,000 లోపు, అదే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికైతే రూ. 1,50,000 లోపు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

దరఖాస్తు ప్రక్రియ…. జూలై 31 చివరి తేదీ

అర్హత కలిగిన క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జూలై 31, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు గడువు విధించారు.

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం tsobmms.cgg.gov.inవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ tscmfc.in ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే 040-233391067 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కార్పొరేషన్‌ ఎండీ పి.సబిత పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More