తెలంగాణలో ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు బలహీనపడటంతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సకాలంలో భారీ వర్షాలు పడతాయని ఆశించిన రైతన్నల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాల మట్టాలు రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించే స్థిరమైన, లాభదాయకమైన సాగు పద్ధతుల వైపు మళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఈ తీవ్ర నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులను ఆదుకునేందుకు సరికొత్త ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రంగంలోకి దించింది. తక్కువ నీటి వినియోగంతో పాటు నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే పంటలను ఎంచుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏటా భారీగా నీటిని వినియోగించి వరి సాగు చేసే రైతులు.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ పంటల సరళిని మార్చుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బోరుబావులు, చెరువుల కింద వరి పండించే రైతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వరికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే క్రాప్స్ వైపు మొగ్గు చూపాలని అధికారులు కోరుతున్నారు.
జూలై చివరి నాటికి ఒకవేళ పొలాల్లో లేదా బోరుబావుల్లో నీటి లభ్యత ఓ మోస్తరుగా ఉంటే, వరికి బదులు మొక్కజొన్న సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఆగస్టు నెలలో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైతే.. నీటి ఎద్దడిని తట్టుకునే పప్పుధాన్యాల సాగు వైపు వెళ్లడం ఉత్తమమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పెసర్లు, కందులు, మినుములు వంటి పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరిస్తున్నారు. తక్కువ నీటితో లాభాలు తెచ్చిపెట్టే పంటల మార్పిడి వ్యూహాలపై రైతులకు పూర్తిస్థాయిలో మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ప్రకృతి సవాలు విసురుతున్న వేళ, రైతులు మొండిగా వరి సాగు వైపు వెళ్లకుండా, ప్రభుత్వ సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటలతో ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కాలని నిపుణులు సూచిస్తున్నారు.
{{/usCountry}}ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరిస్తున్నారు. తక్కువ నీటితో లాభాలు తెచ్చిపెట్టే పంటల మార్పిడి వ్యూహాలపై రైతులకు పూర్తిస్థాయిలో మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ప్రకృతి సవాలు విసురుతున్న వేళ, రైతులు మొండిగా వరి సాగు వైపు వెళ్లకుండా, ప్రభుత్వ సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటలతో ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కాలని నిపుణులు సూచిస్తున్నారు.
{{/usCountry}}