భారతదేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడానికి, ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడానికి ప్రధాన కారణమైన 'ఎల్ నినో' (El Nino) ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పు.. రాబోయే 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

దీనివల్ల కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు, 2027 వర్షాకాలంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ (ఇన్‌కాయిస్) తన మొట్టమొదటి ఎల్ నినో బులెటిన్‌లో సంచలన విషయాలను వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
2026 జూన్ నుండి 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో తీవ్రత ఇలాగే కొనసాగడానికి 70 నుంచి 90 శాతం అవకాశాలు ఉన్నాయని ఇన్‌కాయిస్ తెలిపింది. వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కేవలం 10 నుంచి 30 శాతం మాత్రమే అవకాశం ఉంది.
సాధారణంగా ఎల్ నినో ప్రభావం వేసవి కాలం వరకు పొడిగిస్తే, అది ఆ తర్వాత వచ్చే వర్షాకాలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సముద్రంలో, వాతావరణంలో మార్పులు అంత తొందరగా మారవు కాబట్టి.. 2027 నాటి రుతుపవనాలు కూడా దెబ్బతినే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్ నినో కారణంగా ఉత్తర హిందూ మహాసముద్రంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. దీనివల్ల సముద్రాల్లో వేడి గాలులు(మెరైన్ హీట్‌వేవ్స్) ఏర్పడి, సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.
మత్స్యకారులు, తీరప్రాంతాలపై ప్రభావం
బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు మారడం వల్ల రాబోయే వేట కాలంలో రెండు ముఖ్యమైన చేపల జాతుల దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల తీరప్రాంతాల్లో కోతకు గురికావడం, అకస్మాత్తుగా వరదలు రావడం, తుపానుల తీవ్రత పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి.
{{/usCountry}}బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు మారడం వల్ల రాబోయే వేట కాలంలో రెండు ముఖ్యమైన చేపల జాతుల దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల తీరప్రాంతాల్లో కోతకు గురికావడం, అకస్మాత్తుగా వరదలు రావడం, తుపానుల తీవ్రత పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి.
{{/usCountry}}బంగాళాఖాతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. అరేబియా సముద్రం మాత్రం సాపేక్షంగా ప్రశాంతంగా ఉంటుందని, అక్కడ చేపల వేటకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని ఇన్‌కాయిస్ పేర్కొంది. ఇన్‌కాయిస్ సంస్థ అభివృద్ధి చేసిన అత్యాధునిక 'డీప్ లెర్నింగ్ వాతావరణ నమూనాల' ద్వారా దాదాపు 15 నెలల ముందే ఈ అంచనాలను రూపొందించారు. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో వివరించడానికి ఇలాంటి మరిన్ని బులెటిన్లను విడుదల చేస్తామని సంస్థ ప్రకటించింది.