ESIC Recruitment : ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌లో 67 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు విధానం ఇలా

ESIC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అర్హతగల అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి 31 వరకు హాజరుకావచ్చు.

Published on: Aug 22, 2026, 10:35:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ESIC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ మరియు సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 67 ఖాళీలున్నాయి.

ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌
ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌

ఇంటర్వ్యూ తేదీలు…

విభాగాల వారీగా అభ్యర్థులు వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆగస్టు 24, 25, 26, 27, 31 తేదీలలో ఈ ఇంటర్వ్యూలు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్వ్యూ రోజున ఉదయం 9:00 గంటల నుంచి 10:30 గంటల మధ్య అభ్యర్థులు సంబంధిత వేదిక వద్ద రిపోర్టింగ్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చే అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రక్రియకు అనుమతించరు.

  • ఫ్యాకల్టీ పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయసు ఇంటర్వ్యూ నాటికి 69 సంవత్సరాలు మించకూడదు. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం విద్యార్హతలు, అనుభవం ఉండాలి.
  • సీనియర్ రెసిడెంట్ పోస్టులు : ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థుల గరిష్ట వయసు 45 సంవత్సరాలుగా నిర్ణయించారు.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://esic.gov.in/ ) నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఇంటర్వ్యూ వేదిక వద్ద సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికోద్యోగులు మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు రూ. 500లను ఇంటర్వ్యూ వేదిక వద్ద ఎస్‌బీ కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.2,59,515. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,72,572. అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ కు రూ.1,48,263 జీతం చెల్లిస్తారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

  • ఇంటర్వ్యూలు నిర్వహించే వేదిక : అకాడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సనాత్‌నగర్, హైదరాబాద్.
  • అధికారిక వెబ్ సైట్ - https://esic.gov.in/

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చెక్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More