ఈఎస్ఐసీ హైదరాబాద్ లో 45 ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివిగో
ఈఎస్ఐసీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్,సీనియర్ రెసిడెంట్ ఖాళీలున్నాయి. https://mchyderabad.esic.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పొస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని కలిపి 45 ఖాళీలుండగా…సీనియర్ రెసిడెంట్ పోస్టులు అధికంగా 22 ఉన్నాయి.

ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు కేవలం ఇంటర్వ్యూనే నిర్వహిస్తారు. https://mchyderabad.esic.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలను నమోదు చేసి… అర్హత పత్రాలను తీసుకెళ్లి ఇంటర్వ్యూకి హాజరుకావాలి. డిసెంబర్ 10, 11, 12, 15, 16వ తేదీల్లో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఈఎస్ఐ ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన -ఈఎస్ఐ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్
- మొత్తం ఖాళీలు - 45
- ఖాళీల వివరాలు - సీనియర్ రెసిడెంట్ - 22, ప్రొఫెసర్ - 05, అసోసియేట్ ప్రొఫెసర్ - 06, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 12
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం/ఎంసీహెచ్ తదితర విద్యార్హతలు ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి.
- ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
- గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్లు నుంచి 69 ఏళ్లు మించకూడదు. సీనియర్ రెసిడెంట్ కు అయితే 45 ఏళ్లగా ఉంటే… ఫ్యాకల్టీ విభాగాలకు మాత్రం 69 ఏళ్లు మించకూడదు.
- ప్రొఫెసర్‌కు నెలకు రూ.2,56,671. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,70,681.. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,46,638, సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700 జీతం చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం - https://mchyderabad.esic.gov.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఇంటర్వ్యూ తేదీలు - డిసెంబరు 10, 11, 12, 15, 16.
- ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం - కాన్ఫరెన్స్ హాల్, ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్.
- అధికారిక వెబ్ సైట్ -https://mchyderabad.esic.gov.in/
- అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ లింక్ - https://mchyderabad.esic.gov.in/attachments/recruitmentfile/2_Annexure_IV_ndash_Application_Form_1764400117.pdf
కావాల్సిన పత్రాలు:
- 2 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు
- ఒక సెట్ ధ్రువపత్రాలు
- పుట్టిన తేదీకి సంబంధించిన ధ్రువపత్రం
- పాన్ లేదా పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డులో ఏదైనా ఒకటి ఉండాలి.
- అడ్రస్ ఫ్రూప్
- టెన్త్ మెమో
- ఇతర విద్యా అర్హత పత్రాలు
- మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రం
- కుల ధ్రువీకరణపత్రం
- పని చేసిన అనుభవానికి సంబంధించిన పత్రాలు
- ఇతర అవసరమైన పత్రాలు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

