రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9,97,075 విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది, రెండో సంవత్సరంలో 5,07,949 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా… ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఓవైపు పరీక్షలు ప్రారంభం కాగా… మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఓ తేదీని కూడా డిసైడ్ చేశారు.
మార్చి 3 నుంచి వాల్యూయేషన్…!
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ దిశగా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సంస్కృతం సబ్జెక్ట్ పేపర్లతో మూల్యాంకనం ప్రాసెస్ షురూ కానుంది. ఆ తర్వాత 3 విడతల్లో మిగిలిన సబ్జెక్టుల పేపర్లను దిదే ప్రక్రియ కొనసాగుతుంది.
త్వరితగతిన వాల్యూయేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ప్రతి జవాబు పత్రం క్షుణ్ణంగా పరిశీలించి… మార్కులను ఎంట్రీ చేస్తారు. ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూడాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. వాల్యూయేషన్ ప్రాసెస్ పూర్తి కాగానే… మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ఖరారు చేస్తారు.
టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026
- 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
- 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
- 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
- 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
- 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
- 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
- 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
- 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
- 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2
- 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1