TG SSC Hall Ticket 2026 : తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు ఎప్పుడు..? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?

 Telangana SSC Exams 2026 : తెలంగాణ పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తవుతాయి. మార్చి మొదటి వారంలో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.

Published on: Feb 25, 2026 11:41 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 14 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 18వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. అయితే హాల్ టికెట్ల ఎప్పుడు వస్తాయని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అధికారుల నుంచి వచ్చాయి.

తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు
తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు

TG SSC పరీక్షలు - హాల్ టికెట్లు ఎప్పుడు…?

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు 2,676 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి పరీక్షలకు 5,17,727 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 11,674 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక పదో తరగతి హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల కానున్నాయి. అయితే 5వ తేదీన అందుబాటులోకి తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ టెన్త్ పరీక్షలు - హాల్ టికెట్లు డౌన్లోడ్ ఎలా..?

  1. విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని TG SSC Hall Ticket 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. మీ వివరాలను నమోదు చేయాలి. (జిల్లా, స్కూల్, పుట్టిన తేదీ)
  4. డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఫోన్ కు వాట్సాప్ లింక్…!

ఇక వాట్సాప్ ద్వారా ఈసారి తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లను పంపుతారు. తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ కు హాల్ టికెట్ లింక్ ను పంపుతారు. ఇక్కడ ఓపెన్ చేస్తే డిజిటల్ కాపీ డిస్ ప్లే అవుతుంది. ఇక ఇలా కాకుండా పాఠశాలల ద్వారా ప్రింటెడ్ హాల్‌టికెట్లు కూడా పొందొచ్చు.

టీజీ టెన్త్ ఎగ్జామ్స్ 2026 - షెడ్యూల్

  • 14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
  • 18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
  • 23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
  • 28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
  • 02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
  • 07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
  • 13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
  • 15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
  • 16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్)

తెలంగాణ టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే ఆబ్జెక్టివ్ టైప్(పార్ట్ బీ) ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. చివరి 15 నిమిషాల్లోనే సమాధానాలు పార్ట్ బీ రాయాల్సి ఉంటుంది. ఇక ఈసారి విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించే విషయంలో 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నారు. ఈ టైమ్ కూడా దాటికే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరు.