తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ 2026 విడుదలైంది. టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026 విడుదలైంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజిక్స్, బయోలజీ ఎగ్జామ్స్ సమయంలో మాత్రం మార్పులు ఉంటాయి.

టైమ్ టేబుల్ ఇదే
14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్)
ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అన్ని సాధారణ అకడమిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే ఆబ్జెక్టివ్ టైప్(పార్ట్ బీ) ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. చివరి 15 నిమిషాల్లోనే సమాధానాలు పార్ట్ బీ రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి.
పరీక్ష తేదీల షెడ్యూల్‌లో ఈసారి మార్పులు చూడవచ్చు. పరీక్షకు, పరీక్షకు మధ్య విరామం వచ్చేలా టైమ్ టేబుల్ తయారు చేశారు అధికారులు. విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ పరీక్షల్లో ఇదే తరహా విధానం ఉంటుంది. పరీక్షల మధ్య పండుగలు కూడా వస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఎక్కువ రోజుల గ్యాప్ కూడా ఉండనుంది. మరింత ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలు సిద్ధం కావాలని అధికారులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


