...
...
Next Story

RTC Bus Fares : దసరా వేళ ఆర్టీసీ ఛార్జీల బాదుడు - రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం!

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ బోర్డుల పేరుతో టికెట్ ధరలను డబుల్ చేసి ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు.

Published on: Oct 18, 2026, 12:46:47 IST
Advertisement

బతుకమ్మ, దసరా పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ తీవ్ర భారం మోపుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పండుగ పూట ప్రజలకు ఉపశమనం కలిగించే కానుకలు ఇవ్వాల్సింది పోయి…. టికెట్ ధరలను ఏకంగా రెట్టింపు చేసి నిలువుదోపిడీకి పాల్పడుతుండటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై హరీశ్ రావ్ ఆగ్రహం (image from https://x.com/BRSHarish)
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై హరీశ్ రావ్ ఆగ్రహం (image from https://x.com/BRSHarish)

ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ హరీశ్ రావు పోస్ట్ చేశారు. పండుగల వేళ సాధారణంగా నడిచే రెగ్యులర్ బస్సుల సంఖ్యను కావాలనే తగ్గించి… వాటికే 'స్పెషల్' బోర్డులు తగిలించి ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా జేబులకు చిల్లులు పెట్టే దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు.

“జేబీఎస్ (JBS) నుంచి కరీంనగర్‌కు సాధారణంగా రూ. 230 ఉండే టికెట్ ధరను ఏకంగా రూ. 400కు పెంచేశారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్ (MGBS) వరకు మొన్నటివరకు రూ. 220 ఉన్న టికెట్ ధరను ఇప్పుడు రూ. 290కి పైగా వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే రీతిలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ పండుగ సంబరం లేకుండా చేస్తున్నారు” అని హరీశ్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉచిత ప్రయాణం పేరుతో మోసం - హరీశ్ రావ్

గడిచిన మూడేళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఆర్టీసీ టికెట్ ఛార్జీలను దాదాపు 5 సార్లు పెంచారని…. ఇప్పుడు పండుగల సాకుతో మళ్లీ బాదుడు మొదలుపెట్టి పేదల నడ్డి విరుస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో సొంతూర్లకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.

వెంటనే స్పందించి పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని హరీశ్ రావ్ డిమాండ్ చేశారు. రెగ్యూలర్ బస్సులను యథావిధిగా నడిపి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks