...
...
Next Story

Exams : ఒక్క విద్యార్థి కోసం ఎగ్జామ్ సెంటర్.. చివరకు ట్విస్ట్ ఇచ్చిన స్టూడెంట్

Intermediate exams : ఇంటర్ పరీక్షల సందర్భంగా నాగర్ కర్నూల్‌ జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక విద్యార్థి కోసం ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. కానీ విద్యార్థి మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు.

Published on: Mar 14, 2026, 14:53:30 IST
Advertisement

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంటర్మీడియట్ బ్రిడ్జి కోర్సు మ్యాథమేటిక్స్ పరీక్ష కోసం వరుణ్ సందేశ్ అనే ఒకే విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరు కావడానికి షెడ్యూల్ కూడా ఉంటుందిగా.. ఈ సమయానికి అధికారులు అందరూ ఎగ్జామ్ సెంటర్ వచ్చారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అయితే విద్యార్థి వరుణ్ మాత్రం అధికారులకు ట్విస్ట్ ఇచ్చాడు. పరీక్ష రాయడానికి రాకపోవడంతో అధికారుల ప్రయత్నాలు వృథా అయిపోయాయి. దీంతో సిబ్బంది పరీక్ష కేంద్రంలో పరీక్ష టైమ్ అయ్యేదాకా వేచి ఉన్నారు. ఒక విద్యార్థి కోసం ఐదుగురు సిబ్బందితో కూడిన ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.

పరీక్షకు హాజరు కావాల్సిన కమ్మరి వరుణ్ సందేశ్ మాత్రం ట్విస్ట్ ఇచ్చి పరీక్షకు హాజరుకాలేదు. పరీక్ష మార్గదర్శకాల ప్రకారం, ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం, పరీక్ష నిర్వహించడానికి వచ్చిన ఐదుగురు సిబ్బంది టైమ్ వేస్ట్ అయింది. పరీక్షా సిబ్బంది అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో కూర్చుని చూస్తూ ఉండిపోయారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రం ఖాళీ పరీక్షా హాలుగా మారిపోయింది.

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో అధికారులు పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 1433 పాఠశాలల నుండి 74,371 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 37,982 మంది బాలురు, 36,389 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల కోసం అధికారులు 362 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఫెయిల్ అయిన 4094 మంది విద్యార్థులు కూడా పరీక్షకు హాజరవుతున్నారు.

సీలు చేసిన ప్రశ్నాపత్ర కవర్లను సీసీటీవీ నిఘాలో తెరిచి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా ఉండేలా అధికారులు అన్ని పరీక్షా కేంద్రాలలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తాగునీరు, కుర్చీలు, బెంచీలు, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు భద్రతను చూసుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks