TG SSC Exams 2027 : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు - కొత్త షెడ్యూల్ ఇదే!
Telangana SSC Exam Fee Due Dates : మార్చి 2027లో జరగనున్న తెలంగాణ పదో తరగతిపబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26 వరకు ఫీజు కట్టవచ్చు.
Telangana SSC Exam Fee Due Dates : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 2027లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను పొడిగించింది.

తాజా ఆదేశాల మేరకు….. రెగ్యూలర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు ఈ సవరించిన తేదీలు వర్తిస్తాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ తక్షణమే ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని అధికారులు ఆదేశించారు.
ఆలస్య రుసుము లేకుండా :
- విద్యార్థులు తమ పాఠశాల హెచ్‌ఎంకు ఫీజు చెల్లించే గడువు - 30-10-2026 నుంచి 26-11-2026 వరకు.
- హెచ్‌ఎంలు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు జమ చేసే తేదీలు - 04-11-2026 నుంచి 27-11-2026 వరకు.
- హెచ్‌ఎంలు విద్యార్థుల వివరాలను డీఈఓ (DEO)కు ఆన్‌లైన్‌లో సమర్పించే గడువు - 30-11-2026 వరకు.
రూ.50 ఆలస్య రుసుముతో:
- విద్యార్థులు హెచ్‌ఎంకు ఫీజు చెల్లించే గడువు - 28-11-2026 నుంచి 08-12-2026 వరకు.
- హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే తేదీ - 09-12-2026 వరకు.
- డీఈఓకు విద్యార్థుల డేటా సమర్పించే గడువు - 11-12-2026 వరకు.
రూ.200 ఆలస్య రుసుముతో:
- విద్యార్థులు హెచ్‌ఎంకు ఫీజు చెల్లించే గడువు : 10-12-2026 నుంచి 21-12-2026 వరకు.
- హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే తేదీ: 22-12-2026 వరకు.
- డీఈఓకు విద్యార్థుల డేటా సమర్పించే గడువు: 28-12-2026 వరకు.
రూ.500 ఆలస్య రుసుముతో అయితే విద్యార్థులు 23-12-2026 నుంచి 04-01-2027 వరకు హెచ్‌ఎంకు ఫీజు చెల్లించునేందుకు అవకాశం ఉంటుంది. ఈ గడువు పొడిగింపు అవకాశాన్ని మిగిలిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
పరీక్ష ఫీజు ఎంత చెల్లించాలి….?
- రెగ్యులర్ (అన్ని సబ్జెక్టులకు) : రూ.125 మూడు సబ్జెక్టుల వరకు (ఫెయిల్ అయిన వారికి): రూ.110
- మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు : రూ.125
- ఒకేషనల్ విద్యార్థులకు : రెగ్యులర్ పరీక్ష ఫీజు రూ.125 తో పాటు అదనంగా రూ.60 చెల్లించాలి.
పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి పొడిగించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. హెచ్‌ఎంలు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందే ఫీజులు చెల్లించాలి. అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లోని స్కూల్ లాగిన్ ద్వారా సైబర్ ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో మాత్రమే ఫీజు కట్టాలి. IFMIS పోర్టల్ చలాన్లు లేదా మాన్యువల్ బ్యాంక్ చలాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

