Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

తెలంగాణ ఇంటర్మీడియట్ మార్చి 2027 పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా నవంబరు 13 వరకు, రూ.100 లేట్ ఫీజుతో నవంబరు 20 వరకు చెల్లించవచ్చు.

Published on: Nov 12, 2026, 05:12:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (మార్చి 2027) రాయబోతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి మరో అప్డేట్ ఇచ్చింది. మార్చి 2027 వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు వివిధ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు అప్డేట్
తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు అప్డేట్

మొదటి సంవత్సరం , రెండవ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులలో చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ప్రైవేట్‌గా (అపెండెడ్/ఫెయిల్ అయిన) హాజరవుతున్న విద్యార్థులందరికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

కొత్త ఫీజు చెల్లింపు షెడ్యూల్ వివరాలు:

  • ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబరు 13వ తేదీ వరకు తమ సంబంధిత కళాశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
  • నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు నవంబరు 14వ తేదీ నుండి నవంబరు 20వ తేదీ వరకు రూ.100 లేట్ ఫీజు చెల్లించి ఫీజు సమర్పించే అవకాశం కల్పించారు.
  • కళాశాల ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలువిద్యార్థుల నుంచి సేకరించిన విరాళాలు మరియు సాధారణ ఫీజు మొత్తాన్ని నవంబరు 13 నాటికి, ఆలస్య రుసుము మొత్తాన్ని నవంబరు 21వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా ఇంటర్‌బోర్డు ఖాతాకు జమ చేయాలని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఇంటర్‌బోర్డు ఆదేశించింది.
  • విద్యార్థులకు సమాచారం తెలిసేలా ఈ షెడ్యూల్‌ను కళాశాలల నోటీసు బోర్డులపై తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.

ఫీజు చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గడువు ముగిసేవరకు వేచి చూడకుండా విద్యార్థులు వీలైనంత త్వరగా తమ ఫీజును చెల్లించి, సంబంధిత రశీదును భద్రపరుచుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.

మరోవైపు ఇంటర్మీడియట్ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా….. ఈసారి వార్షిక పరీక్షల మధ్య వ్యవధిని పెంచాలని యోచిస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేయగా…. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒకరోజు ఫస్ట్ ఇయర్, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఒకే సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఒక పరీక్షకు, మరో పరీక్షకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే సమయం దొరుకుతోంది. దీంతో పాఠ్యాంశాలను సరిగ్గా పునశ్చరణ (రివిజన్) చేసుకోవడానికి సమయం చాలక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన ఇంటర్మీడియట్ బోర్డు….. విద్యార్థుల ప్రయోజనాల కోసం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పరీక్షల మధ్య ఉండే వ్యవధిని రెండు రోజులకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు రెండు వేర్వేరు షెడ్యూళ్లను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణ పద్ధతిలో ఒక టైమ్‌టేబుల్, అలాగే ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా మరో టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసి విద్యాశాఖకు పంపించారు.

పరీక్షల మధ్య రెండు రోజుల వ్యవధి లభిస్తే విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పునశ్చరణ చేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయగలరని అధికారులు నమ్ముతున్నారు. దీంతో ఇంటర్ బోర్డు పంపిన రెండు రోజుల వ్యవధి కలిగిన టైమ్‌టేబుల్‌కే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More