Telangana Inter Exams 2027 : ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు...! ఈసారి వ్యవధి పెంచేలా షెడ్యూల్?

Telangana Inter Exams 2027 : ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వార్షిక పరీక్షల మధ్య రెండు రోజుల వ్యవధి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి ఫిబ్రవరి 24 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Published on: Nov 7, 2026, 15:55:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana Inter Exams 2027 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా….. ఈసారి వార్షిక పరీక్షల మధ్య వ్యవధిని పెంచాలని యోచిస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేయగా…. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు - (ఫైల్ ఫొటో)
తెలంగాణ ఇంటర్ పరీక్షలు - (ఫైల్ ఫొటో)

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒకరోజు ఫస్ట్ ఇయర్, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఒకే సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఒక పరీక్షకు, మరో పరీక్షకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే సమయం దొరుకుతోంది. దీంతో పాఠ్యాంశాలను సరిగ్గా పునశ్చరణ (రివిజన్) చేసుకోవడానికి సమయం చాలక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

షెడ్యూళ్లు సిద్ధం….!

ఈ పరిస్థితిని గమనించిన ఇంటర్మీడియట్ బోర్డు….. విద్యార్థుల ప్రయోజనాల కోసం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పరీక్షల మధ్య ఉండే వ్యవధిని రెండు రోజులకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు రెండు వేర్వేరు షెడ్యూళ్లను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణ పద్ధతిలో ఒక టైమ్‌టేబుల్, అలాగే ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా మరో టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసి విద్యాశాఖకు పంపించారు.

పరీక్షల మధ్య రెండు రోజుల వ్యవధి లభిస్తే విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పునశ్చరణ చేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయగలరని అధికారులు నమ్ముతున్నారు. దీంతో ఇంటర్ బోర్డు పంపిన రెండు రోజుల వ్యవధి కలిగిన టైమ్‌టేబుల్‌కే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరీక్షలు ఎప్పుడు..?

మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. త్వరలోనే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. షెడ్యూల్ తో పాటు టైమింగ్స్ వివరాలను కూడా వెల్లడిస్తారు.

ఈసారి కొత్తగా ఫస్టియర్‌‌, సెకండియర్‌‌ విద్యార్థులిద్దరికీ ప్రాక్టికల్స్‌‌ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు ప్రాక్టికల్‌‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈసారి సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More