ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పోడనూర్ - బరౌని - పోడనూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఫలితంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వైపు వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు ఊరట లభించనుంది.
మొత్తం 8 సర్వీసులు పొడిగింపు..
- రైలు నంబర్ 06021 (పోడనూర్ - బరౌని) : ఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం ఉదయం 06:15 గంటలకు పోడనూర్ నుంచి బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 13:30 గంటలకు బరౌని చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసును నవంబర్ 8, 2026 నుంచి నవంబర్ 29, 2026 వరకు (మొత్తం 4 ట్రిప్పులు) పొడిగించారు.
- రైలు నంబర్ 06022 (బరౌని - పోడనూర్) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 10:30 గంటలకు బరౌని నుంచి బయలుదేరి, శుక్రవారం రాత్రి 18:30 గంటలకు పోడనూర్ చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసును నవంబర్ 11, 2026 నుంచి డిసెంబర్ 02, 2026 వరకు (మొత్తం 4 ట్రిప్పులు) అందుబాటులో ఉంచనున్నారు. రెండు మార్గాల్లో మొత్తం 8 ప్రత్యేక సర్వీసులను ప్రయాణికుల కోసం నిర్వహించనున్నారు.

ఈ ప్రత్యేక రైళ్లు వైవైపులా ప్రయాణించే క్రమంలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ఇందులో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లున్నాయి. అంతేకాకుండా తమిళనాడులోని తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూర్… ఇతర రాష్ట్రాల్లోని బల్హార్షా, చంద్రపూర్, నాగపూర్, బెతుల్, ఇటార్సి, పిపారియా, గాదర్‌వారా, జబల్‌పూర్, కట్ని, మైహార్, సాత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛివోకి, చునార్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డీడీయూ), బాక్సర్, ఆరా, దానాపూర్, పాట్లీపుత్ర, సోన్‌పూర్, హాజీపూర్, షాపూర్ పటోరీ స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.
ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఈ టికెట్లను ఆన్‌లైన్ లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) కౌంటర్ల ద్వారా బుక్ చేసుకుని