ఇన్వెస్ట్ తెలంగాణపై భారీగా ప్రచారం.. సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు

ఇన్వెస్ట్ తెలంగాణపై భారీగా ప్రచారం చేయాలని సీఎస్ సంజయ్ జూజు అన్నారు. సెలబ్రిటీలతో ఈ ఈవెంట్‌పై షార్ట్‌ఫిల్మ్‌లు చేయించాలన్నారు.

Published on: Oct 21, 2026, 17:37:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit 2026) ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు సంబంధించిన సన్నాహకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సమ్మిట్‌ ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు ఆయన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

సీఎస్ సంజయ్ జూజు
సీఎస్ సంజయ్ జూజు

ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరగనుంది. సమ్మిట్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయిలో చాటిచెప్పేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

దేశంలోని ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాలు, ప్రముఖ స్టార్ హోటళ్ల వద్ద సమ్మిట్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన హోర్డింగులు, డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పరిశ్రమల స్నేహపూర్వక విధానాలు, సమ్మిట్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రముఖ సినీ, పారిశ్రామిక ప్రముఖులతో స్వల్ప నిడివి గల ప్రచార చిత్రాలను (Short Films) రూపొందించాలన్నారు.

సోషల్ మీడియా, గ్లోబల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెలంగాణ పారిశ్రామిక పురోగతిని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రచార క్యాంపెయిన్లు నిర్వహించాలన్నారు సీఎస్. తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలకు రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా స్వాగతం పలకాలని సీఎస్ స్పష్టం చేశారు.

'మన రాష్ట్ర చారిత్రక సుసంపన్నతను, విశిష్ట సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా ప్రదర్శించాలి. సదస్సుకు వచ్చే విదేశీ, స్వదేశీ అతిథులకు మన సంప్రదాయ కళారూపాలతో ఘన స్వాగతం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా సమ్మిట్ ముగింపు వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా కల్చరల్ కార్నివాల్ నిర్వహించి నగరవాసులను, అతిథులను అలరించాలి.' అని సీఎస్ సంజయ్ జాజు అధికారులను పురమాయించారు.

తెలంగాణ ప్రభుత్వం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డేటా సెంటర్లు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ 2.0 ను డిజైన్ చేసింది. గతంలో జరిగిన సదస్సుల ద్వారా వచ్చిన పెట్టుబడుల ఒప్పందాలను వేగవంతం చేయడంతో పాటు, రాబోయే డిసెంబర్ సమ్మిట్ ద్వారా వేల కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులను, లక్షలాది ఉద్యోగావకాశాలను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

ప్రపంచ వేదికపై తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయిని చాటి చెప్పేలా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More