Citroen cars : భారత్‌లో సిట్రోయెన్ భారీ ప్లాన్.. రూ.4000 కోట్ల పెట్టుబడి, 3 కొత్త కార్లు!
భారత ఆటోమొబైల్ విపణిలో తమ ఉనికిని మరింత విస్తరించేందుకు ప్రసిద్ధ ఆటోమొబైల్ దిగ్గజం స్టెల్లాంటిస్ సిద్ధమైంది. సిట్రోయెన్ బ్రాండ్ కింద స్మాల్ హ్యాచ్‌బ్యాక్, సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ, డీ-సెగ్మెంట్ ఎంపీవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది.
భారతీయ కార్ల విపణిలో సంచలనం సృష్టించేందుకు ఆటోమొబైల్ దిగ్గజం స్టెల్లాంటిస్ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు వచ్చింది. తమ అనుబంధ బ్రాండ్ ‘సిట్రోయెన్’ ద్వారా సరికొత్త వాహనాలను భారత రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఒక చౌకైన చిన్న కారు (ఏ సెగ్మెంట్), శక్తివంతమైన సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ, కుటుంబాలకు అనువైన డీ-సెగ్మెంట్ ఎంపీవీ మోడళ్లను మార్కెట్లో పరిచయం చేయనుంది. తమ ‘ఫాస్ట్‌లేన్ 2030’ వ్యూహంలో భాగంగా ఈ ఆటోమొబైల్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.

రూ. 4,000 కోట్ల అదనపు పెట్టుబడి..
భారత మార్కెట్‌పై ఉన్న నమ్మకంతో రాబోయే మూడేళ్లలో రూ. 4,000 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనితో 2030 నాటికి దేశంలో స్టెల్లాంటిస్ మొత్తం పెట్టుబడి రూ. 15,000 కోట్లకు చేరుకోనుంది. రాబోయే కాలంలో జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల నుంచి మొత్తం 12 కొత్త లేదా అప్‌డేటెడ్ మోడళ్లను పరిచయం చేయనున్నారు. వీటిలో 7 సరికొత్త కార్లు కాగా, మిగిలిన 5 మోడళ్లను మేజర్ అప్‌డేట్లతో తీసుకురానున్నారు. సిట్రోయెన్ నుంచి 7 కార్లు, జీప్ నుంచి 5 కార్లు విడుదల కానున్నాయి. వీటిలో మొదటి కారు 2027 రెండో త్రైమాసికంలో (క్యూ2 2027) భారత రోడ్లపైకి రానుంది.
చిన్న కారు నుంచి లగ్జరీ ఎంపీవీ వరకు..
ప్రస్తుతం సిట్రోయెన్ వద్ద లేని సరికొత్త వాహన విభాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ కార్లను రూపొందిస్తున్నారు:
ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ : ప్రస్తుత సిట్రోయెన్ C3 కంటే చౌకగా ఉండే ఒక కాంపాక్ట్ కారును రూపొందిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ వచ్చే అవకాశం ఉంది. ఇది గనక మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం విపరీతమైన ఆదరణ పొందుతున్న ఎంజీ కామెట్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ : ఎయిర్‌క్రాస్, బసాల్ట్ మోడళ్ల కంటే పైస్థాయిలో ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీని తీసుకురానున్నారు.
డీ-సెగ్మెంట్ ఎంపీవీ : పెద్ద కుటుంబాలకు అనువైన ఏడు లేదా ఎనిమిది సీట్ల ఎంపీవీ రంగానికి శ్రీకారం చుడుతున్నారు. టయోటా ఇన్నోవా, మారుతీ సుజుకీ ఎర్టిగా వంటి కార్లకు ఇది పోటీ ఇవ్వనుంది.
90 శాతం స్థానిక పరికరాల వినియోగం..
కార్ల తయారీ వ్యయాన్ని తగ్గించి, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే వాహనాలను అందించాలనే లక్ష్యంతో 90 శాతం స్వదేశీ పరికరాలను వాడాలని నిర్ణయించారు. దీనివల్ల స్పేర్ పార్ట్స్ ధరలు తగ్గడమే కాకుండా, సర్వీసింగ్ ఖర్చులు కూడా వినియోగదారుడికి అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 'బ్రాండ్ హౌస్' రీటైల్ షోరూమ్‌ల ద్వారా సేవా నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఐసీటీ సెంటర్, తమిళనాడు, మహారాష్ట్రల్లో తయారీ ప్లాంట్లు కలిగి ఉన్న ఈ సంస్థ, భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌తో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో బహుళ ఎంపికలను అందుబాటులోకి తేనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


