Honda SUVs : హోండా మాస్టర్ ప్లాన్.. కాంపాక్ట్ ఎస్‌యూవీ, 500 కి.మీ రేంజ్ ఈవీ లాంచ్‌కి సై!
భారత మార్కెట్లో తిరిగి పూర్వవైభవం సాధించేందుకు హోండా కార్స్ ఇండియా భారీ వ్యూహాన్ని ప్రకటించింది. సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రంగంలోకి దించబోతోంది.
భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఆదరణ పొందుతున్న ఎస్‌యూవీ విభాగంలో తమ పట్టును పటిష్టం చేసుకునేందుకు 'హోండా కార్స్ ఇండియా' ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ విపణిలో 10కి పైగా సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ జపనీస్ దిగ్గజం, సబ్-4 మీటర్ల సబ్‌కాంపాక్ట్ విభాగంలోకి నేరుగా అడుగుపెట్టబోతోంది. ఇది మార్కెట్లో ఇప్పటికే తిరుగులేని ఆధిక్యంలో ఉన్న టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కార్ల పొడవు పరంగా పన్ను మినహాయింపులు లభించే సబ్-4 మీటర్ల విభాగం భారత కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడానికి హోండా సిద్ధమైంది.
"నాలుగు మీటర్ల కంటే తక్కువ సైజు కలిగిన ఎస్‌యూవీలతో పాటు, అంతకంటే పెద్ద పరిమాణం ఉన్న వాహనాలను కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం," అని హోండా కార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు.
2027 నాటికి '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..
ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి హోండా ఘనంగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘0 ఆల్ఫా’ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్న తమ తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2027 నాటికి భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కారు 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవుతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి రానుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా ఎలివేట్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్ కాదని, సంపూర్ణంగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటున్న మోడల్ అని కంపెనీ స్పష్టం చేసింది.
Mileage cars : రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ సంచలనం.. ఏకంగా 29 కి.మీ మైలేజ్! సెగ్మెంట్లోనే హయ్యెస్ట్
ఈ ఈవీని రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో తయారీ చేయనున్నారు. ఇక్కడి నుంచే జపాన్ సహా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలని హోండా ప్రణాళికలు రచిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చేలా దీని బ్యాటరీ సామర్థ్యాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇళ్ల వద్ద ఛార్జింగ్ సదుపాయాలతో పాటు పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది.
నెక్ట్స్-జెన్ హైబ్రిడ్ టెక్నాలజీ.. హెచ్‌బ్యాక్‌లకు స్వస్తి
ఎలక్ట్రిక్ రంగానికే పరిమితం కాకుండా, తమ నెక్ట్స-జెనరేషన్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా హోండా భారత్‌కు తీసుకురానుంది. 2027లో గ్లోబల్ అరంగేట్రం చేయనున్న ఈ సరికొత్త హైబ్రిడ్ సిస్టమ్, ప్రస్తుతం హోండా సిటీలో ఉన్న ఈ:హెచ్ఈవీ టెక్నాలజీకి అదనపు బలాన్ని ఇవ్వనుంది. ఇకపై హెచ్‌బ్యాక్ కార్ల జోలికి వెళ్లకుండా కేవలం ఎస్‌యూవీలు, సెడాన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. వివిధ ధరల శ్రేణిలో కస్టమర్లకు వాహనాలు అందుబాటులో ఉంచేందుకు గ్లోబల్ మోడళ్లను సీబీయూ, సీకేడీ మార్గాల్లో కూడా తెచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


